ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సచివాలయ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు

మరో వారం రోజుల్లో సచివాలయ ఉద్యోగాలకు పరీక్షలు జరగనున్న నేపథ్యంలో కృష్ణాజిల్లాలో ఏర్పాట్లపై కలెక్టర్ ఇంతియాజ్ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో తొలిరోజు లక్షా 14 వేల మంది పరీక్షకు హాజరవుతారని కలెక్టర్ వెల్లడించారు.

By

Published : Aug 24, 2019, 10:04 PM IST

కలెక్టర్

మీడియాతో కలెక్టర్ ఇంతియాజ్

గ్రామ, వార్డు సచివాలయ పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ వెల్లడించారు. జిల్లా ఎంపిక కమిటీ గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగులను ఎంపిక చేయనున్న నేపథ్యంలో పరీక్షల నిర్వహణపై క్యాంప్ కార్యాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. వచ్చే నెల 1 నుంచి 8 వరకు జరగనున్న ఈ పరీక్షల్లో దాదాపు 20 లక్షలకు పైగా అభ్యర్థులు హాజరుకానున్నారని కృష్ణా జిల్లాలో తొలిరోజు లక్షా 14 వేల మంది పరీక్ష రాయనున్నట్లు వెల్లడించారు. జిల్లాలో 374 పరీక్ష కేంద్రాలను గుర్తించామన్న కలెక్టర్...100 మార్గాల్లో కేంద్రాలకు చేరుకునేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. అభ్యర్థులు ఉదయం 9.30 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని ఆలస్యమైతే అనుమతించేదని లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. అభ్యర్థులు వేరు వేరు పరీక్షలు రాస్తున్న నేపథ్యంలో ఉదయం రాసిన కేంద్రంలోనే మధ్యాహ్నం కూడా పరీక్ష రాసేలా చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ ఇంతియాజ్ వివరించారు.

ABOUT THE AUTHOR

...view details