ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'శ్రిఖా ఏపీ పోలీసులను ప్రభావితం చేసింది' - shrikha choudary

భర్త హత్య కేసులో నిజానిజాలు వెల్లడి కావాలంటే.. కేసును తెలంగాణ పోలీసులకు బదిలీ చేయాలని పద్మశ్రీ కోరింది.

భర్త హత్య కేసులో నిజానిజాలు వెల్లడి కావాలంటే ..తెలంగాణ పోలీసులకు బదిలీ చేయాలని పద్మశ్రీ కోరింది.

By

Published : Feb 5, 2019, 11:25 PM IST

భర్త హత్య కేసులో నిజానిజాలు వెల్లడి కావాలంటే ..తెలంగాణ పోలీసులకు బదిలీ చేయాలని పద్మశ్రీ కోరింది.
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ పీఎస్‌లో చిగురుపాటి జయరాం భార్య పద్మశ్రీ ఫిర్యాదు చేసింది. ఇంటికి వచ్చేసరికి పడకగది అల్మారా తెరిచి ఉందని... విలువైన వస్తువులు మాయమైనట్లు గుర్తించానని తెలిపింది. ఈ విషయమై వాచ్‌మెన్‌ను ప్రశ్నించానని పేర్కొంది. శ్రిఖాచౌదరి వచ్చి వెళ్లినట్లు వాచ్‌మెన్‌ చెప్పారని తెలిపింది. పోస్టుమార్టం రిపోర్టు ఇవ్వాలని నందిగామ పోలీసులను కోరానని... ఇంతవరకు ఇవ్వలేదని వెల్లడించింది. నందిగామ పోలీసులు కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని అనుమానం వ్యక్తం చేసింది. నా భర్త హత్య కేసులో నిజానిజాలు వెల్లడి కావాలంటే ..తెలంగాణ పోలీసులకు కేసును బదిలీ చేయాలని పద్మశ్రీ కోరింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details