''గవర్నర్ గారూ.. అండగా ఉంటారని ఆశిస్తున్నా'' - ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్
నూతన గవర్నర్ బిశ్వభూషణ్‌కు జనసేన అధినేత పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన అనుభవం.. రాష్ట్రాభివృద్ధికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నట్టు చెప్పారు.
pa1kalyan
ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేసిన బిశ్వభూషణ్ హరిచందన్ కు... జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ శ్రేణుల తరపున శుభాకాంక్షలు తెలిపారు. అపార రాజకీయ అనుభవం ఉన్న హరిచందన్... కొత్త రూపు సంతరించుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్ గా రావడం శుభపరిణామం అన్నారు. అభివృద్ధి లేమి, నిధులు కొరత, అంసపూర్తిగా మిగిలిపోయిన విభజన హామీలతో సతమతమవుతున్న ఆంధ్రప్రదేశ్ కు... హరిచందన్ అండగా ఉంటారని రాష్ట్ర ప్రజలు ఆశగా ఉన్నట్లు పవన్ తెలిపారు.