జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కృష్ణా జిల్లా గుడివాడలో మంత్రి కొడాలి నానితో భేటీ అయ్యారు. అన్ని వర్గాలవారిని ఆకట్టుకునేలా జగన్ పాలన ఉందని ప్రశంసించారు. తెదేపాకి అనుకూలంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ వ్యవహరిస్తున్నారని రాపాక విమర్శించారు. కరోనా వ్యాప్తి పేరుతో గతంలో స్థానిక సంస్థల ఎన్నికలను నిలిపేశారని..,ఇప్పుడు కరోనా విజృంభిస్తున్న సమయంలో ఎన్నికలు జరుపుతామంటే న్యాయస్థానాలు అంగీకరించబోవని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లోనూ జరిగే పరిస్థితులు లేవన్నారు.
'అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా జగన్ పాలన'
అన్ని వర్గాలవారిని ఆకట్టుకునేలా జగన్ పాలన ఉందని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ప్రశంసించారు. కృష్ణా జిల్లా గుడివాడలో మంత్రి కొడాలి నానితో ఆయన భేటీ అయ్యారు.
'అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా జగన్ పాలన'