ఏ వ్యవస్థకైనా... ఆర్థిక క్రమశిక్షణ అవసరం: ఐవైఆర్
వ్యవస్థలకైనా..... ప్రభుత్వాలకైనా ఆర్థిక క్రమశిక్షణ అవసరమని మాజీ సీఎస్, భాజపా సీనియర్ నేత ఐవైఆర్ కృష్ణారావు అభిప్రాయపడ్డారు.
IYR_KRISHNARAO_SPEECH_ON_STATE GOVT-ECONOMICAL DISCIPLINE
విజయవాడలోని ఓ ప్రైవేటు హోటల్ లో గోపాలరావు ఠాకూర్ స్మారక ప్రసంగాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాలు - ఆర్థిక క్రమశిక్షణ అనే అంశంపై మాజీ సీఎస్ కృష్ణారావు ప్రసంగించారు. రాష్ట్రంలో ఐదేళ్లలో ఆర్థిక విశృంఖలత్వం చోటు చేసుకుందని.....నియంత్రణ లేకుండా వనరులను ఇష్టారాజ్యంగా దుర్వినియోగం చేశారని కృష్ణారావు ఆరోపించారు. కేంద్రం నుంచి రావాల్సిన ప్రయోజనాలను పొందినా... ఇంకా ఏమీ ఇవ్వలేదనే అపోహలను ప్రజల్లో సృష్టించారని మండిపడ్డారు.