ముఖ్యమంత్రికి ముఖ్య కార్యదర్శిగా పని చేస్తున్న ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాశ్ మళ్లీ కేంద్ర సర్వీసుకు వెళ్లనున్నారని అధికార వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. కేంద్ర సర్వీసుకు వెళ్లేందుకు తనకు అవకాశం వచ్చిన విషయాన్ని ఆయన ముఖ్యమంత్రి జగన్ వద్ద ప్రస్తావించగా.. సుముఖంగా స్పందించారని అధికార వర్గాల సమాచారం. ప్రవీణ్ ప్రకాశ్ ప్రస్తుతం ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి పోస్టుతో పాటు, సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శిగానూ పూర్తి అదనపు బాధ్యతలను నిర్వహిస్తున్నారు. రాష్ట్ర కేడర్‌కు చెందిన ఆయన గతంలో కేంద్ర సర్వీసులో పని చేశారు. తెదేపా ప్రభుత్వ హయాంలో దిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనరుగా బాధ్యతలను నిర్వర్తించారు. వైకాపా అధికారంలోకి వచ్చాక.. సీఎంవోకి వచ్చారు. ప్రవీణ్ ప్రకాశ్ దిల్లీ వెళితే... ప్రస్తుతం ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఎస్.ఎస్.రావత్ సీఎంవోలోకి వస్తారన్న ప్రచారం జరుగుతోంది.
మళ్లీ కేంద్ర సర్వీసుకు ప్రవీణ్ ప్రకాశ్! - ప్రవీణ్ ప్రకాశ్ తాజా వార్తలు
ముఖ్యమంత్రికి ముఖ్య కార్యదర్శిగా పని చేస్తున్న ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాశ్ మళ్లీ కేంద్ర సర్వీసుకు వెళ్లనున్నారని అధికార వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ప్రవీణ్ ప్రకాశ్ దిల్లీ వెళితే... ప్రస్తుతం ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఎస్.ఎస్.రావత్ సీఎంవోలోకి వస్తారని సమాచారం.
మళ్లీ కేంద్ర సర్వీసుకు ప్రవీణ్ ప్రకాశ్