ఆంధ్రప్రదేశ్

andhra pradesh

జగన్​కు విధ్వంసం అంటే ఇష్టం అనుకుంటా: నారాయణ

By

Published : Oct 24, 2020, 6:15 PM IST

గీతం వర్సిటీకి చెందిన కొన్ని కట్టడాలు కూల్చివేతపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. అర్ధరాత్రి ఉగ్రవాదులపై దాడి చేసినట్టు చేసి కట్టడాలను కూల్చివేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఇది ముమ్మాటికీ రాజకీయ కక్షతో చేసిన పనేనని పేర్కొన్నారు. విజయవాడలో అయన మీడియాతో మాట్లాడారు.

I think Jagan likes destruction: Narayana
నారాయణ

ముఖ్యమంత్రి జగన్​కు విధ్వంసం అంటే ఇష్టం అనుకుంటానని.. పాలనా ప్రజావేదిక కూల్చివేతతో మొదలు పెట్టారని సీపీఐ జాతీయ కార్యదర్శి పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్మించిన ప్రజావేదిక కట్టడాన్ని ఊడదీసే అవకాశం ఉన్నా... కూల్చివేశారని విమర్శించారు. ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించి ఉంటే రెగ్యూలరైజ్ చేసుకునే స్కీం ఉంది కదా అని గుర్తుచేశారు. చట్ట ప్రకారం రెగ్యూలరైజ్ చేయొచ్చని.. జరిమానా విధించవచ్చని చెప్పారు. ఈ తరహా కూల్చివేతలు మంచిది కాదని హితవు పలికారు.

భాజపా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తుందని.. ప్రధాని ఇచ్చిన హామీలనే అమలు చేయరా..? అని నారాయణ ప్రశ్నించారు. 3 రాజధానులని ముక్కలు చేస్తుంటే జోక్యం చేసుకోరా అని నిలదీశారు. జీఎస్టీ పరిహారం, పోలవరానికి నిధులు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. అమరావతిని కోరుకునే రాజకీయ పార్టీలు 29 గ్రామాల్లోనే కాదు, చిత్తశుద్ధి ఉంటే 13 జిల్లాల్లో తిరుగుతూ ఉద్యమాన్ని చేయాలన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల తీరుతో రవాణా సౌకర్యం లేక, ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీకి గురవుతూ సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అంతర్రాష్ట్ర రవాణా సౌకర్యం కల్పించాలని.. ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడుకుని సమస్యను పరిష్కరించాలని కోరారు.

ఇదీ చదవండీ... గీతం వర్సిటీకి చెందిన కొన్ని కట్టడాలు కూల్చివేత

ABOUT THE AUTHOR

...view details