ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'అవగాహన ఉన్నప్పుడే మానవ హక్కుల సంఘం సమాజంలో నిలబడుతుంది' - మహిళా అక్షరాస్యత

హక్కుల కమిషన్, రాజ్యాగంలోని చట్టాలపై అవగాహన పొందినప్పుడే.. మానవ హక్కుల సంఘం సమాజంలో నిలబడుతుందని సీబీఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు. హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు మానవ హక్కుల సంఘం సభ్యులు అండగా నిలిచి సమస్య పరిష్కార దిశగా పని చేయాలని సూచించారు. విజయవాడ మొగల్రాజపురంలో 'గ్లోబల్ హ్యూమన్ రైట్స్ అవెరనెస్ అసోసియేషన్' ఆధ్వర్యంలో ప్రపంచ మానవ హక్కుల పై జాతీయ స్ధాయి అవగాహన సదస్సు నిర్వహించారు.

సీబీఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ

By

Published : Sep 26, 2021, 10:52 PM IST

మహిళా అక్షరాస్యత కోసం నిరంతరం కృషి చేసిన సావిత్రిభాయ్​ ఫూలేను ఆదర్శంగా తీసుకుని మహిళలు ముందుకు సాగాలని సీబీఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. మానవ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు మానవ హక్కుల సంఘం సభ్యులు అండగా నిలిచి సమస్య పరిష్కార దిశగా పనిచేయాలని సూచించారు. మనిషి బతకడం కోసం కాదని.. గౌరవంగా జీవించే విధంగా సభ్యులు పనిచేస్తే అ సంఘానికి మంచి గుర్తింపు వస్తుందని అన్నారు.

హక్కుల కమిషన్, రాజ్యాగంలోని చట్టాలపై అవగాహన పొందినప్పుడే.. మానవ హక్కుల సంఘం సమాజంలో నిలబడుతుందని లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. పోలీసుశాఖ మనవ హక్కులు కోసం నిత్యం కృషి చేస్తోందని సెంట్రల్ ఏసీపీ ఖాదర్ బాషా అన్నారు. మీడియా, సోషల్ మీడియా ద్వారా మానవ హక్కుల గురించి ప్రజలంతా అవగాహన పొందుతున్నారని తెలిపారు.

ఇదీ చదవండి:'అది స్వేచ్ఛ కాదు బాధ్యత.. నిబద్ధతతో చదవాలి'

ABOUT THE AUTHOR

...view details