ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 16, 2021, 8:54 PM IST

ETV Bharat / city

BONDA UMA: బోండా ఉమ ఇంటివద్ద ఉద్రిక్తత.. జైల్ ​భరో భగ్నం

విజయవాడలో తెదేపా నేత బోండా ఉమ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆయన చేపట్టతలచిన జైల్ ​భరో కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు.

uma
uma

విజయవాడ మొగల్రాజపురంలోని తెదేపా మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ ఇంటివద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రమ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన లోకేశ్​ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.

లోకేశ్​ అరెస్టుకు నిరసనగా జైల్ ​భరో కార్యక్రమానికి పిలుపునిచ్చారు. దానిని పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమయంలో పోలీసులు, బోండా ఉమకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. పోలీసుల తీరుకు నిరసనగా ఇంటివద్ద రోడ్డుపైనే బోండా బైటాయించారు.

ABOUT THE AUTHOR

...view details