తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అగ్రిగోల్డ్ కేసుపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. విజయవాడ లబ్బీపేటలోని అగ్రిగోల్డ్ ఆస్తుల వేలానికి ఉన్నత న్యాయస్థానం ఆమోదం తెలిపింది. ఎస్‌బీఐ వేలంలో 1401చదరపు గజాల భూమిని రూ.22.45 కోట్లకు విజన్ ఎస్టేట్స్ దక్కించుకుంది. అగ్రిగోల్డ్‌కు విజన్ ఎస్టేట్స్ బినామీ కాదని తెలంగాణ హైకోర్టుకు ఏపీ సీఐడీ వివరించింది. వాస్తవ మార్కెట్ ధరకన్నా విజన్ ఎస్టేట్స్ తక్కువకు కోట్ చేసిందని ఏపీ సీఐడీ తెలిపింది.
AGRI GOLD: విజయవాడలోని అగ్రిగోల్డ్ ఆస్తులు..విజన్ ఎస్టేట్స్‌కే - telangana varthalu
విజయవాడ లబ్బీపేటలోని అగ్రిగోల్డ్ ఆస్తుల వేలానికి తెలంగాణ హైకోర్టు ఆమోదం తెలిపింది. మూడు సార్లు నిర్వహించిన వేలంలో విజన్ ఎస్టేట్స్ మాత్రమే పాల్గొందని ఎస్‌బీఐ కోర్టుకు విన్నవించగా.. విజన్ ఎస్టేట్స్‌కు భూమిని రిజిస్ట్రేషన్ చేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.
అది వాస్తవ ధరకన్నా తక్కువేనని ఏపీ ప్రభుత్వం, అగ్రిగోల్డ్ బాధితుల సంఘం తెలంగాణ హైకోర్టుకు విన్నవించాయి. మూడుసార్లూ నిర్వహించిన వేలంలో విజన్ ఎస్టేట్స్ మాత్రమే పాల్గొందని ఎస్‌బీఐ హైకోర్టుకు వివరించింది.
మూడుసార్లు వేలం నిర్వహించినందున జాప్యం అక్కర్లేదని ఉన్నత న్యాయస్థానం సూచించింది. అగ్రిగోల్డ్ బాధితుల సంఘం వేలంలో ఎక్కువ ధరకు కొనేవారిని తేలేదని కోర్టు తెలిపింది. మూడు సార్లు నిర్వహించిన వేలంలో పాల్గొన్న విజన్ ఎస్టేట్స్‌కు భూమిని రిజిస్ట్రేషన్ చేయాలని హైకోర్టు ఆదేశించింది.