RAINS IN VIJAYAWDA : విజయవాడలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తుల అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరంలో కురిసిన భారీ వర్షానికి మిద్దె కూలి ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు.
రాష్ట్రంలో భారీ వర్షాలు.. మిద్దె కూలి ఐదుగురికి తీవ్ర గాయాలు
17:47 September 30
విజయవాడలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం
వైఎస్సార్ కడప జిల్లాలో వానల కారణంగా కమలాపురం- కాజీపేట మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కమలాపురం వద్ద పాగేరులో కుంగిపోయినలో లెవల్ వంతెన ప్రమాదకరంగా ఉండటంతో రాకపోకలు నిలిపివేశారు.
జమ్మలమడుగు-ముద్దనూరు మధ్య వర్షం కారణంగా రోడ్డు కొట్టుకుపోయింది. పెన్నా నదిపై తాత్కాలిక వంతెన రోడ్డు మళ్లీ కొట్టుకుపోవడంతో 17 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మైలవరం జలాశయం నుంచి పెన్నానదికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయం నుంచి 3వేల క్యూసెక్కులు నీరు విడుదల అవుతోంది.
ఇవీ చదవండి :