అన్ని ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రాల్లో సిబ్బందికి ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ హాజరు నమోదు అమలు చేయనున్నట్లు రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్ జె.నివాస్ స్పష్టం చేశారు. ఈ విషయంలో పీహెచ్‌సీలు సర్వసన్నద్ధంగా ఉండాలన్నారు. వారంలోగా పీహెచ్సీలలో బయో మెట్రిక్ పరికరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అన్ని జిల్లాల వైద్యారోగ్య, ఇమ్యూనైజేషన్, మలేరియా అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సాధారణ ప్రసవాలు అంతంత మాత్రంగా జరగటంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి పీహెచ్‌సీలోనూ ఇద్దరు వైద్యాధికారులు తప్పనిసరిగా ఉండాల్సిందేనని.., వారిని వేరే ప్రాంతాలకు పంపవద్దని స్పష్టం చేశారు.
"ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రాల్లో ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ హాజరు"
అన్ని జిల్లాల వైద్యారోగ్య, ఇమ్యూనైజేషన్, మలేరియా అధికారులతో రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్ జె.నివాస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రాల్లో సిబ్బందికి ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ హాజరు నమోదు అమలు చేయనున్నట్లు ఆయన స్పష్టం చేసారు.
జిల్లా వైద్యారోగ్యశాఖాధికారులు క్షేత్ర స్థాయిలో క్రమం తప్పకుండా పర్యటిస్తూ.. పర్యవేక్షించాలని ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్ హైమావతిని ఆదేశించారు. గడువులోగా ఫీవర్ సర్వేను పూర్తి చేయాల్సిందేనని.., అలసత్వం వహిస్తే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. సంబంధిత వైద్య అధికారులు మండల అభివృద్ధి అధికారుల సహకారంతో ఫీవర్ సర్వేకు ప్రణాళిక వేసుకోవాలని సూచించారు. గ్రామ సచివాలయాల స్థాయిలో మొబిలైజేషన్ చేసుకోవాలన్నారు. హెల్త్ ఐడీల జనరేషన్ డ్రైవ్‌ను వేగవంతం చేయాలన్నారు.
ఇదీ చదవండి: నేనెవరికీ దత్తున్ని కాదు.. సొంతవాళ్లున్నారు : పవన్