ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'నివర్ తుపానును ఎదుర్కొనేందుకు ప్రత్యేక బృందాలు' - నివర్ తుపాను న్యూస్

నివర్ తుపాను హెచ్చరికలపై రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అప్రమత్తమైంది. అత్యవసర పరిస్థితుల్లో స్పందించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని.., అవసరమైన వనరులు సిద్ధంగా ఉంచుకోవాలని ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ జిల్లా వైద్యాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

నివర్ తుపానును ఎదుర్కొనేందుకు ప్రత్యేక బృందాలు
నివర్ తుపానును ఎదుర్కొనేందుకు ప్రత్యేక బృందాలు

By

Published : Nov 23, 2020, 7:37 PM IST

బంగాళాఖాతంలో ఏర్పడిన నివర్ తుపాను హెచ్చరికలపై రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అప్రమత్తమైంది. అన్ని జిల్లాల వైద్య ఆరోగ్యశాఖాధికారులను అప్రమత్తం చేస్తూ... ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర పరిస్థితుల్లో స్పందించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని.., అవసరమైన వనరులు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. వైద్యాధికారి నేతృత్వంలో ఒక స్టాఫ్ నర్స్, ఒక ఆరోగ్య కార్యకర్తతో కూడిన వైద్య బృందం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వైద్య సేవలు అందించాలన్నారు. ఔషధాలు, క్రిమిసంహారకాలను నిల్వ చేసుకుని ఆయా ప్రాంతాలలో పారిశుద్ధ్య పరిస్థితులను చక్కదిద్దాలని.., అంటు వ్యాధుల నివారణకు అవసరమైన చర్యల్ని తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.

ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనూ కనీసం రెండు అంబులెన్స్​లను సిద్ధంగా ఉంచాలన్నారు. ప్రభావిత ప్రాంతాల్లో సురక్షితమైన తాగునీరు, పాల సరఫరాలకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని భాస్కర్ సూచించారు. గర్భిణులు, ఐదేళ్లలోపు చిన్నారులు, వృద్ధుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ప్రసవానికి సిద్ధంగా ఉన్న గర్భిణులను దగ్గరలోని ఆరోగ్య కేంద్రాలకు తరలించాలన్నారు. వివరాలను ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రధాన కార్యాలయాలనికి పంపాలని వైద్యఅధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details