HIGH SCHOOL PLUS: రాష్ట్రవ్యాప్తంగా 292 ఉన్నత పాఠశాలలను హైస్కూల్ ప్లస్‌గా మార్పు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పాఠశాలలను బాలికలకు ప్రత్యేకంగా కేటాయిస్తూ ఆదేశాలు వెలువరించింది. ఈ పాఠశాలల్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీలలో రెండు కోర్సులు మాత్రమే అందించనున్నట్లు స్పష్టం చేసింది. స్థానికంగా ఉన్న డిమాండ్‌ను అనుసరించి కోర్సులు నిర్ధారించాలని నిర్ణయించింది. పీజీటీ సమాన స్థాయి అధ్యాపకులనే బోధనకు తీసుకోనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. 1752 స్కూల్ అసిస్టెంట్లను 292 జూనియర్ కళాశాలలలో పని చేసేందుకు నియమిస్తామని వెల్లడించింది. పాఠశాలల్లో నాడు- నేడు పనులు చేపట్టిన దృష్ట్యా.. అదనపు తరగతి గదులను మంజూరు చేయబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది.
292 ఉన్నత పాఠశాలలు అప్‌గ్రేడ్.. హైస్కూల్ ప్లస్‌గా మార్పు
SCHOOLS UPGRADE: రాష్ట్ర వ్యాప్తంగా 292 ఉన్నత పాఠశాలలను హైస్కూల్ ప్లస్‌గా మార్పు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పాఠశాలల్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీలలో రెండు కోర్సులు మాత్రమే అందించనున్నట్లు స్పష్టం చేసింది. హైస్కూల్ ప్లస్ పాఠశాలలను బాలికలకు ప్రత్యేకంగా కేటాయిస్తూ ఆదేశాలు వెలువరించింది.
SCHOOLS UPGRADE