ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Govt Employees association demands to solve PRC issue: పీఆర్సీ సమస్యను పరిష్కరించకుంటే ఉద్యమ బాట పడతాం: ఆస్కార్‌రావు

Govt Employees association demands to solve PRC issue: జనవరిలోగా పీఆర్సీ సమస్యను పరిష్కరించకుంటే.. ఉద్యమబాట పడతామని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కార్‌రావు తెలిపారు. మూడు నెలల నుంచి ఉద్యోగ సంఘాల మధ్య 11వ పీఆర్సీ అమలుపై గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. ఇప్పటికైనా సీఎం జగన్ స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.

Government Employees association demands to solve PRC issue
పీఆర్సీ సమస్యను పరిష్కరించకుంటే ఉద్యమ బాట పడతాం: ఆస్కార్‌రావు

By

Published : Nov 30, 2021, 8:23 PM IST

Govt Employees association demands to solve PRC issue: మూడు నెలల నుంచి ఉద్యోగ సంఘాల మధ్య 11వ పీఆర్సీ అమలుపై గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని.. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కార్‌రావు అన్నారు. నవంబర్ 10న జరిగిన ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించిన డిమాండ్లపై.. ప్రభుత్వానికి నివేదిక సమర్పించామన్నారు. జనవరి లోగా సమస్యను పరిష్కరించకుంటే.. ఉద్యమ బాటపడతామని ఆయన హెచ్చరించారు. ఇప్పటికైనా సీఎం జగన్ స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. వైద్యారోగ్యశాఖ జారీ చేసిన జీవో నెంబర్ 143ను (సిబ్బందిని తగ్గించే చర్యలు తీసుకోబోతున్నట్లు ఉన్న జీవో) తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఉద్యోగ సంఘాలను పిలిచి, జీవోపై చర్చించకుండా.. జీవో విడుదల చేశారన్నారు.తక్షణమే జీవో 143 ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details