ఎంఎస్‌ఎంఈలు, టెక్స్‌టైల్, స్పిన్నింగ్ మిల్స్ కు ఊతమిచ్చేందుకు ప్రోత్సాహకాలను రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ విడుదల చేయనుంది. 1,124 కోట్ల ప్రోత్సాహకాలను క్యాంప్ కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి సీఎం జగన్ విడుదల చేయనున్నారు. ఎంఎస్‌ఎంఈలకు 440 కోట్లు, టెక్స్‌టైల్, స్పిన్నింగ్ మిల్స్‌కు 684 కోట్లు జమ చేయనున్నారు. ఇప్పటివరకు ఈ రంగాలకు 2,086.42 కోట్లు ప్రోత్సాహకాలను అందించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. పారిశ్రామికాభివృద్దికి వెన్నెముకగా నిలుస్తూ రాష్ట్రంలో దాదాపు 12 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న ఎంఎస్‌ఎంఈలు, టెక్స్‌టైల్, స్పిన్నింగ్ మిల్స్‌కు ఊతమిస్తూ ప్రోత్సాహకాలు విడుదల చేయనుట్లు ప్రభుత్వం తెలిపింది.
MSME FUNDS: పరిశ్రమలకు రూ.1,124 కోట్ల ప్రోత్సాహకాలు
ఎంఎస్‌ఎంఈలు, టెక్స్‌టైల్, స్పిన్నింగ్ మిల్స్ కు ఊతమిచ్చేందుకు ప్రోత్సాహకాలను రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ విడుదల చేయనుంది. 1,124 కోట్ల ప్రోత్సాహకాలను క్యాంప్ కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి సీఎం జగన్ విడుదల చేయనున్నారు.
పరిశ్రమలకు రూ.1,124 కోట్ల ప్రోత్సాహకాలు
ఎలక్ట్రానిక్ పరిశ్రమల ఏర్పాటు ద్వారా రూ. 10,000 కోట్ల పెట్టుబడిని ఆకర్షించడానికి కొప్పర్తిలో రూ. 730.50 కోట్ల పెట్టుబడితో 801 ఎకరాల్లో వైఎస్సార్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ద్వారా 30,000 మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వం తీసుకున్న క్రియాశీలక చర్యలతో, 5,204.09 కోట్ల పెట్టుబడితో ఏర్పాటైన 16,311 ఎంఎస్‌ఎంఈలు అదనంగా 1,13,777 మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: