GAS RATES HIKE: ధరల దరువు.. సామాన్యులపై గ్యాస్ గుదిబండ.. - గ్యాస్ సిలిండర్ ధరలు
వంట గ్యాస్ ధర పెరుగుదల సామాన్యునికి గుదిబండగా మారింది. నెలనెల గ్యాస్ బండ ధర పెరుగుతుండడంతో పేద ప్రజలు అల్లాడిపోతున్నారు. చిన్న, పెద్ద హోటళ్లు, బండ్లపైన టిఫిన్లు విక్రయించుకుంటూ జీవనం సాగించే కుటుంబాలు పెరిగిన ధరలతో కుదేలవుతున్నారు. గత నెల మూడో వారంలోనే 25 రూపాయలు గ్యాస్ ధర పెంచిన కేంద్రం ప్రభుత్వం..15 రోజులు తిరగకముందే మరో పాతిక రూపాయలు భారం వేయటాన్ని సామాన్య ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. పెరిగిన ధరలను వెంటనే తగ్గించకపోతే పేద ప్రజలు బతికే పరిస్థితి లేదని అంటున్నారు. ఇదేవిధంగా పెరిగితే తాము బతకటం కష్టమైపోతుందని వాపోతున్నారు. ప్రభుత్వం పేద ప్రజలను దృష్టిలో పెట్టుకుని.. గ్యాస్ ధరలు తగ్గించాలని కోరుతున్నారు.
gas prices hike