ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Vaccine: విదేశాలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులకు వ్యాక్సినేషన్: సింఘాల్

విదేశాలకు వెళ్లే ఉద్యోగులు, విద్యార్దులకు టీకా వేసే విషయంలో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ సింఘాల్ తెలిపారు. వైద్యుల సమస్యలను పరిష్కరించేందుకు సీఎస్​తో చర్చించినట్లు పేర్కొన్నారు.

anil singhal on vaccinating foreign travellers
విదేశాలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులకు వ్యాక్సినేషన్

By

Published : Jun 2, 2021, 7:30 PM IST

విదేశాలకు వెళ్లే ఉద్యోగులు, విద్యార్దులకు వ్యాక్సినేషన్ వేసే విషయంలో ప్రాధాన్యత ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ స్పష్టం చేశారు. విదేశీ ప్రయాణాలు చేసే వ్యక్తులు పాస్ పోర్టు నెంబరు కూడా ఇవ్వాలని ఆయన తెలిపారు. కానీ.. కొవిన్ యాప్​లో ఆ సదుపాయం లేకపోవటంతో ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు. ఈ విషయంలో సాంకేతిక సమస్యను సవరింపుపై కేంద్రానికి లేఖ రాసినట్లు వెల్లడించారు.

మరోవైపు సీనియర్ రెసిడెంట్ వైద్యులకు స్టైఫండ్ రూ. 45 వేల నుంచి రూ. 70 వేలకు పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వారి ఇతర డిమాండ్లపై కూడా సీఎస్​తో చర్చించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం కరోనా సమయంలో వారి ఆందోళనను విరమించుకోవాల్సిందిగా కోరినట్టు స్పష్టం చేశారు.

రాష్ట్రంలో క్రమంగా కొవిడ్ ఆస్పత్రులు, కొవిడ్ కేర్ కేంద్రాల్లో పడకల ఖాళీల సంఖ్య పెరుగుతోందని.. డిశ్చార్జిలు పెరుగుతుండటంతో ఈ వెసులుబాటు కలుగుతున్నట్లు తెలిపారు. గడచిన 24 గంటల వ్యవధిలో 443 టన్నుల ఆక్సిజన్ వినియోగించినట్లు పేర్కొన్నారు. గతంలో రాష్ట్రంలో గరిష్ఠంగా ఒక్క రోజులో 640 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ వినియోగించగా.. 800 మెట్రిక్ టన్నుల వరకూ సేకరించగలినట్లు స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details