ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Flexi Conflict: పార్కులో మద్యం ఫ్లెక్సీ.. విస్తుపోతున్న సందర్శకులు - విజయవాడ బెరం పార్కులో మద్యం ధరలపై ఫ్లెక్సీ

Flexi on Wine at Park: ఆరోగ్యం కోసం పార్క్​కు వచ్చే వారికి వింత అనుభవం ఎదురవుతోంది. చెడు వ్యసనాలను వీడి మంచి ఆరోగ్యం పెంపొందించుకోవాలని పార్క్​కు వచ్చే ప్రాంతంలో మద్యం తాగండి... మా దగ్గర ధరలు తక్కువ అనే బ్యానర్లు వెలిశాయి. మంచి ఆరోగ్యం కోసం వచ్చే ప్రదేశాల్లో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఇలాంటి ప్రచారం ఏంటని ప్రతి ఒక్కరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Flexi on Wine at Park
మద్యం ధరలపై పార్కు లో ఫ్లెక్సీ...విస్తుపోతున్న సందర్శకులు...

By

Published : Feb 25, 2022, 12:39 PM IST

Flexi on Wine at Beram Park: విజయవాడ బెరంపార్క్​లో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రకటనలు విమర్శలకు తావిస్తోంది. మా బార్​లో అన్ని రకాల మద్యంపై తగ్గింపు ధరలు అని మద్యం సీసాలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. బెరంపార్క్ ప్రధాన ద్వారం, పార్క్ లోపల ఇటువంటి బోర్డులు ఏర్పాటు చేయటంతో సందర్శకులు విస్తుపోతున్నారు.

పార్క్​కు విదేశాల నుంచి సైతం యాత్రికులకు వస్తుండటంతో బార్ ఏర్పాటు చేశారు. అయితే కుటుంబ సభ్యులతో సందర్శకులు బెరంపార్క్​కు వెళుతుంటారు. అటువంటి ప్రదేశంలో ఈ విధంగా బోర్డులు ఏర్పాటు చేయటం ఏంటని సందర్శకులు ప్రశ్నిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details