ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఫాస్టాగ్‌ కార్డులు ఉచితమే! - free fastag news

టోల్​ట్యాక్స్ వసూలు కోసం తీసుకొచ్చిన ఫాస్టాగ్ కార్డులను ఉచితంగా ఇవ్వాలని కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. డిసెంబరు ఒకటో తేదీలోగా కార్డులు తీసుకునే వారికి మినహాయింపు ఇచ్చినట్లు స్పష్టం చేసింది.

fastag-policy-at-tollgates-in-india
ఫాస్టాగ్‌ కార్డులు ఉచితమే!

By

Published : Nov 28, 2019, 7:23 AM IST



టోల్‌ట్యాక్స్‌ వసూలు కోసం ప్రవేశపెట్టిన ఫాస్టాగ్‌ కార్డులను ఉచితంగా ఇవ్వాలని స్పష్టం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో ఫాస్టాగ్‌ కార్డు విలువ రూ.100 గా ప్రభుత్వం నిర్ణయించింది. డిసెంబరు ఒకటో తేదీలోగా ఆ కార్డు తీసుకునే వారి నుంచి ఆ రూ.వంద వసూలు చేయవద్దని చెప్పింది. సెక్యూరిటీ డిపాజిట్‌ను మినహాయిస్తే బాగుంటుందని, ఈ అంశాన్ని ఆయా బ్యాంకుల విచక్షణకే వదిలేసినట్లు కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇప్పటిదాకా 70లక్షలకు పైగా ‘ఫాస్టాగ్స్‌’ జారీ అయ్యాయి. ఒక్క మంగళవారమే 1,35,583 ఫాస్టాగ్స్‌ జారీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details