కులం, మతం, ప్రాంతీయతత్వం, ప్రలోభాలకు లోంగకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎన్నికల నిఘా వేదిక విజ్ఞప్తి చేసింది. విజయవాడలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వద్ద నిఘా వేదికకు సంబంధించిన 2 కరపత్రాలను విడుదల చేశారు. నేర చరితుల్ని, అవినీతిపరులైన నేతల్నీ ఎన్నుకోకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని నిఘా వేదిక సభ్యులు కోరారు. ఏప్రిల్ 11న ప్రతి ఒక్కరూ దేశ భవిష్యత్తు కోసం కొంత సమయం కేటాయించి... సరైన నేతను ఎన్నుకునేందుకు ఓటు హక్కు వినియోగిచుకోవాలని ఓటర్లకు సూచించారు.
ఓటేస్తేనే ప్రశ్నించే హక్కు: రాష్ట్ర ఎన్నికల నిఘా వేదిక - రాష్ట్ర ఎన్నికల నిఘావేదిక
ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయండి. నేరస్థులకు ఓటు వేయకండి. ఓటే మీ ఆయుధం.. మీ చేతిలోనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఏప్రిల్ 11న ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని మా విజ్ఞప్తి. ఓటేస్తేనే ప్రశ్నించే హక్కు ఉంటుంది. -నాగేశ్వరరావు, రాష్ట్ర ఎన్నికల నిఘా వేదిక సమన్వయకర్త
నిఘావేదికకు సంబంధించిన రెండు కరపత్రాలను విడుదల చేశారు