ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మూడోదశ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతం: గిరిజా శంకర్ - ఎన్నికల సంఘం తాజా వార్తలు

మూడో దశ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయని రాష్ట్ర పంచాయతీ ఎన్నికల అధికారి గిరిజా శంకర్ స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 84.92 శాతం పోలింగ్ నమోదైందన్నారు.

మూడోదశ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతం
మూడోదశ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతం

By

Published : Feb 17, 2021, 7:37 PM IST

Updated : Feb 17, 2021, 10:50 PM IST

మూడోదశ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని...రాష్ట్ర పంచాయతీ ఎన్నికల అధికారి గిరిజ శంకర్ తెలిపారు. మొత్తం 84.92 శాతం పోలింగ్ నమోదవగా.. అత్యధికంగా విజయనగరం జిల్లాలో 87.09 శాతం ఓటింగ్ రికార్డయిందని తెలిపారు. అత్యల్పంగా విశాఖ జిల్లాలో 69.28 శాతం పోలింగ్ నమోదైందన్నారు. మూడో విడత ఎన్నికల్లో జరిగిన చెదురుముదురు ఘటనల్ని...పోలీసులు ఎప్పటికప్పుడు నియంత్రణలోకి తెచ్చినట్లు తెలిపారు.

తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం కొత్తపల్లి పోలింగ్ కేంద్రంలో..ఏపీవోగా విధులు నిర్వహిస్తున్న దైవకృపావతి మృతి చెందడం దురదృష్టకరమన్నారు. ఆమె కుటుంబానికి పరిహారం అందించేలా.కలెక్టర్తో​ మాట్లాడామన్నారు.

Last Updated : Feb 17, 2021, 10:50 PM IST

ABOUT THE AUTHOR

...view details