ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విద్యాశాఖలో ఉద్యోగాల భర్తీకి త్వరలో క్యాలెండర్: మంత్రి సురేశ్ - Education Minister Adimulapu Suresh

విద్యాశాఖలో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన క్యాలెండర్​ను రానున్న ఉగాది రోజు విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. కళాశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపర్చనున్నట్లు మంత్రి వెల్లడించారు.

Education Minister on recruitment calendar
విద్యా శాఖలో ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్

By

Published : Mar 26, 2021, 8:58 PM IST

రాష్ట్రంలోని వివిధ కళాశాలల్లో విద్యార్థులకు విద్యాప్రమాణాలు మెరుగుపర్చనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. అందులో భాగంగానే రానున్న ఉగాదిని పురస్కరించుకొని విద్యాశాఖలో పోస్టుల భర్తీకి సంబంధించిన క్యాలెండర్​ను విడుదల చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ మేరకు విద్యాశాఖ అధికారులతో మంత్రి సమీక్షించారు. ఏప్రిల్ 9న జగనన్న విద్యా దీవెన ప్రథకం కింద ఫీజులు చెల్లిస్తామన్నారు.

ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో కళాశాలల్లో విద్యావిధానంలో సంచలన మార్పులకు శ్రీకారం చుట్టినట్లు మంత్రి వెల్లడించారు. ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలకు కావాల్సిన మౌలిక వసతుల కల్పనకు వీలైనంత త్వరగా నిధులు విడుదల చేయాలని సీఎం ఆదేశించినట్లు చెప్పారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details