ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Results: ఈఏపీసెట్ ఇంజినీరింగ్ ఫలితాలు విడుదల

eapcet engineering results released
ఈ ఏపీసెట్ ఇంజినీరింగ్ ఫలితాలు విడుదల

By

Published : Sep 8, 2021, 11:07 AM IST

Updated : Sep 8, 2021, 6:01 PM IST

11:03 September 08

eapcet results

ఫలితాలు విడుదల చేస్తున్న మంత్రి ఆదిమూలపు సురేశ్

రాష్ట్రంలో ఇంజినీరింగ్‌, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో చేరేందుకు నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష ‘ఏపీ ఈఏపీసెట్’(EAPCET) ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడ ఆర్‌అండ్‌బీ కార్యాలయంలో.. మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఇంజినీరింగ్‌()Engineering results ఫలితాలను విడుదల చేశారు. ఈనెల 14న వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల ఫలితాలు వెల్లడించనున్నారు. ఇంజినీరింగ్‌ విభాగంలో 1,34,205 (80.62శాతం) మంది ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి తెలిపారు. రేపటి నుంచి ర్యాంక్‌ కార్డుల డౌన్‌లోడ్‌కు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.

    విద్యార్థి పేరు        ర్యాంకు     జిల్లా
నిఖిల్‌ మొదటి(1) ర్యాంకు అనంతపురం
వరదా మహంతనాయుడు రెండో   (2) ర్యాంకు శ్రీకాకుళం
వెంకట ఫణీష్‌ నాలుగో (4) ర్యాంకు కడప
దివాకర్‌ సాయి నాలుగో (4) ర్యాంకు విజయనగరం
మౌర్యా రెడ్డి  ఐదో    (5)  ర్యాంకు నెల్లూరు
శశాంక్‌రెడ్డి   ఆరో  (6) ర్యాంకు ప్రకాశం
ప్రణయ్‌   ఏడో  (7) ర్యాంకు విజయనగరం
హర్ష వర్మ ఎనిమిదో (8) ర్యాంకు విజయవాడ
కార్తికేయ తొమ్మిదో (9) ర్యాంకు పశ్చిమగోదావరి
ఓరుగంటి నివాస్‌    పదో (10) ర్యాంకు చిత్తూరు

తొలుత ఇంజినీరింగ్‌ (ఎంపీసీ స్ట్రీమ్‌), ఆ తర్వాత వ్యవసాయ, ఫార్మసీ ప్రవేశాలు నిర్వహించనున్నారు. ఎంపీసీ స్ట్రీమ్‌కు 1,76,603మంది దరఖాస్తు చేయగా.. 1,66,460మంది హాజరయ్యారు. పరీక్ష రాసిన వారిలో అయిదుగురు కొవిడ్ బారినపడ్డారని.. వారికి మళ్లీ పరీక్ష నిర్వహిస్తామని మంత్రి తెలిపారు.

ఇదీ చదవండి: 

KRMB: రాష్ట్ర ప్రభుత్వానికి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు లేఖ

Last Updated : Sep 8, 2021, 6:01 PM IST

ABOUT THE AUTHOR

...view details