హైకోర్టు పర్యవేక్షణలో వైద్యం అందేలా చూడాలని డాక్టర్ సుధాకర్ పిటిషన్ దాఖలు చేశారు. విశాఖ మానసిక వైద్యశాలలో ఇచ్చే వైద్యం ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని తెలిపారు. ఐదుగురిని బాధ్యులుగా పేర్కొంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు సరైన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని డా.సుధాకర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆసుపత్రిలో అందిస్తున్న చికిత్సపై సుధాకర్ పలు అనుమానాలు వ్యక్తం చేశారు. వైద్యులు అందిస్తున్న ఔషధాల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని పిటిషన్లో పేర్కొన్నారు .
హైకోర్టు పర్యవేక్షణలో చికిత్స అందేలా చూడాలని వైద్యుడి పిటిషన్ - హైకోర్టులో డాక్టర్ సుధాకర్ పిటిషన్ తాజా వార్తలు
డాక్టర్ సుధాకర్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు పర్యవేక్షణలో వైద్యం అందేలా చూడాలని పిటిషన్ దాఖలు చేశారు.
doctor sudhakar petetion in high court about his medical treatment
మరో ఆసుపత్రికి తరలించి మేరుగైన చికిత్స అందించాలని హైకోర్టును కోరారు. వైద్యులు తనకు ఎటువంటి వైద్యం, ఔషధాలు ఇస్తున్నారో వాటి వివరాలను పిటిషన్లో తెలిపారు. ఈ పిటిషన్పై శుక్రవారం విచారణ జరిగే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: కన్న కొడుకును ఎత్తుకోకుండానే.. కాటికి వెళ్తున్నాడు!
Last Updated : May 29, 2020, 7:14 AM IST