అచ్చెన్నాయుడు అరెస్టుపై భాజపాలో భిన్నాభిప్రాయాలు - esi scam latest news in ap
ఈఎస్ఐలో అవకతవకల ఆరోపణలపై తెదేపా నేత అచ్చెన్నాయుడు అరెస్టుపై భాజపా రాష్ట్ర విభాగంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఆయన అరెస్టును భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సమర్థించగా.... తప్పుబట్టిన నేతలపై భాజపా క్రమశిక్షణ చర్యలు చేపట్టింది.
తెదేపా నేత అచ్చెన్నాయుడు అరెస్టుపై భాజపా రాష్ట్ర విభాగంలో భిన్నాభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అచ్చెన్నాయుడు అరెస్టును సమర్థించగా... కొందరు నాయకులు వ్యతిరేకిస్తున్నారు. అయితే అరెస్టును తప్పుబట్టిన నేతలపై భాజపా క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. పార్టీ నిర్ణయానికి భిన్నంగా మీడియా చర్చల్లో మాట్లాడారని భాజపా నేత లక్ష్మీపతి రాజాను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అచ్చెన్నాయుడికి మద్దతుగా మాట్లాడిన... విజయవాడ పార్లమెంటు ఇన్‌ఛార్జ్‌కు పార్టీ నాయకత్వం నోటీసులు ఇచ్చింది.