సైబర్ క్రైమ్ పై అవగాహన పెరగాలని డీజీపి గౌతం సవాంగ్ అన్నారు. మహిళలు, పిల్లలపై జరుగుతున్న సైబర్ దాడులను అరికట్టేందుకు ప్రారంభించిన ఈ రక్షాబంధన్ కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమం మహిళలకు అండగా ఉంటుందని సినీ నటి సమంత అన్నారు . సైబర్ క్రైమ్ లో ఎన్నో తెలియని విషయాలు ఈ రక్షాబంధన్ ద్వారా తెలుసుకున్నామని విద్యార్థినులు తెలిపారు.
మహిళలు, చిన్నారులపై జరుగుతున్న సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు ఈరక్షాబంధన్ కార్యక్రమం ఎంతో ఉపయోగపడిందని సినీ నటి సమంత అన్నారు. ఈ రక్షాబంధన్ కార్యక్రమంలో ఆమె వెబినార్ ద్వారా పాల్గొని సందేశం ఇచ్చారు. ట్రోలింగ్, స్టాకింగ్ లాంటి వేధింపులు నేడు ఆన్ లైన్ లో చాలామంది మహిళలకు జరుగుతుందన్నారు. వీటిపై ప్రత్యేకంగా నెలరోజుల పాటు అవగాహన కార్యక్రమాలు పెట్టి ప్రజలను చైతన్య పరచటం మంచి పరిణామమన్నారు . నాలుగు శాతం మంది మహిళలే తమపై ఆన్ లైన్ లో వేధింపులు జరిగాయని తెలిపినట్లు డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు . అవగాహన కార్యక్రమాలు జరుగుతుంటాయన్నారు. పదిలక్షల మంది వినియోగదారులు ఈ కార్యక్రమాన్ని వీక్షించటం చాలా సంతోషంగా ఉందన్నారు. సైబర్ క్రైమ్ పై మరింత లోతుగా అవగాహన కల్పిస్తామన్నారు
ఈ-రక్షాబంధన్ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. నెలరోజుల్లో 10 లక్షల మంది మహిళలకు అవగాహన కల్పించాం. మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సైబర్ నిపుణులతో శిక్షణ ఇప్పించాం. సైబర్ నేరాలపై ప్రజలంతా అప్రమత్తం కావాలి.