విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు అసహనం వ్యక్తం చేశారు. గంటల తరబడి తాము క్యూ లైన్లలో నిరీక్షిస్తున్నా దర్శన అవకాశం రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రూ. 100, రూ. 300 టిక్కెట్లు కొనుగోలు చేసి కూడా ఆరేడు గంటల పాటు క్యూ లైన్లలోనే నిరీక్షించాల్సి వస్తోందంటూ అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అసహనాన్ని వ్యక్తం చేశారు. చిన్నపిల్లలతో పాటు వచ్చిన మహిళలు తమ చేతిలోనే టిక్కెట్లను చూపిస్తూ దర్శన ఏర్పాట్లపై మండిపడుతున్నారు. వీఐపీలు, వీవీఐపీలు, ప్రోటోకాల్ దర్శనాలను పోలీసులు దగ్గరుండి చేయిస్తున్నారని.. చివరి రోజు రద్దీకి తగినట్లుగా భక్తుల దర్శనాన్ని వేగవంతం చేయకపోవడంపై అసంతృప్తి చెందుతున్నారు.
INDRAKEELADRI: దర్శన నిరీక్షణపై భక్తుల ఆగ్రహం.. ప్రభుత్వ తీరుపై నినాదాలు - దర్శన నిరీక్షణపై భక్తుల ఆగ్రహం
నవరాత్రుల ఆఖరి రోజు దుర్గమ్మను దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రి వచ్చిన భక్తులు తీవ్ర అసహనానికి లోనయ్యారు. దర్శనానికి గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉంచడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
INDRAKEELADRI
Last Updated : Oct 15, 2021, 4:09 PM IST