ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనాపై ప్రశ్నిస్తే ఎదురుదాడికి దిగుతారా.. ?: దేవినేని - ప్రశ్నిస్తే ఎదురుదాడికి దిగుతారా ?: దేవినేని

కరోనా నియంత్రణ చర్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే... వైకాపా నేతలు ఎదురుదాడికి దిగటం తగదని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆక్షేపించారు. కరోనాపై మంత్రుల మాటలు సహేతుకంగా లేవని విమర్శించారు.

ప్రశ్నిస్తే ఎదురుదాడికి దిగుతారా ?: దేవినేని
ప్రశ్నిస్తే ఎదురుదాడికి దిగుతారా ?: దేవినేని

By

Published : May 2, 2020, 7:14 PM IST

బాధ్యత కలిగిన ప్రధాన ప్రతిపక్షంగా రాష్ట్రంలో కరోనా పరిస్థితులను బయటపెడుతుంటే... వైకాపా నేతలు ఎదురుదాడి చేయడం తగదని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. కరోనా నియంత్రణ చర్యలపై మంత్రుల మాటలు సహేతుకంగా లేవని విమర్శించారు. కృష్ణా, గోదావరి నదుల ద్వారా వేల టీఎంసీల నీరు సముద్రం పాలయిందని... రాష్ట్రంలో సాగునీరు అందక చేతికొచ్చిన పంటను రైతులు దున్నుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీరు లేక ప్రజలు అలమటిస్తున్నారని...దీనిపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details