మంత్రి బొత్స అమరావతి సందర్శన నాటకాలను ప్రజలు విశ్వసించరని మాజీమంత్రి దేవినేని ఉమా విమర్శించారు. ఇప్పటికైనా ముక్కు నేలకు రాసి తప్పు చేశామని ఒప్పుకోవాలని హితవు పలికారు. అమరావతే రాజధాని అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించాలని దేవినేని డిమాండ్ చేశారు.
మంత్రి బొత్స అమరావతి సందర్శన ఓ నాటకం: దేవినేని - అమరావతే రాజధాని అని జగన్ ప్రకటన చేయాలి
అమరావతే రాజధాని అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించాలని మాజీ మంత్రి దేవినేని డిమాండ్ చేశారు. మంత్రి బొత్స అమరావతి సందర్శన నాటకాలను ప్రజలు విశ్వసించరని ఎద్దేవా చేశారు.
మంత్రి బొత్స అమరావతి సందర్శన అంతా నాటకం: దేవినేని
బొత్స సత్యనారాయణ అమరావతిలో అసంపూర్తిగా ఉన్న బహుళ అంతస్తుల భవనాలను సందర్శించడం కోర్టులలో తగులుతున్న ఎదురుదెబ్బలకు అధికార పార్టీ ప్రారంభించిన మరో నాటకమని దుయ్యబట్టారు. గత 188 రోజులుగా, 29 గ్రామాలలో రాజధాని రైతులు ఆందోళన చేస్తున్నారన్నారు. 66 మంది రైతులు ఈ పోరాటంలో ప్రాణాలర్పించారని గుర్తు చేశారు. 108 కుంభకోణాన్ని బహిర్గతం చేసినందున పోలీసులు పట్టాభిరాం నివాసం వద్ద నిఘా పెట్టడం దుర్మార్గమని మండిపడ్డారు.