దళితుల భూములకు కౌలు చెల్లించకుండా సీఆర్డీఏ కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారని అమరావతి రాజధాని ఎస్సీ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌలు చెక్కుల చెల్లింపు కోసం విజయవాడ సీఆర్డీఏ కార్యాలయానికి వచ్చిన దళిత రైతులు..మరోసారి అధికారులకు కౌలు చెక్కులు చెల్లించాలని విన్నవించారు. రెండేళ్లుగా తమకి కౌలు చెల్లించకుండా సీఎం జగన్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
కౌలు చెల్లించడం లేదని ఎస్సీ రైతుల ఆగ్రహం
దళితుల భూములకు కౌలు చెల్లించకుండా సీఆర్డీఏ కార్యాలయం చుట్టు తిప్పుకుంటున్నారని రాజధాని ఎస్సీ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఇచ్చిన హామీలను అడిగితే కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు.
మాట్లాడుతున్న రైతులు
జగన్ ఇచ్చిన హామీలను అడిగితే కేసులు నమోదు చేస్తున్నారని, ఎన్ని కేసులు పెట్టినా తమకు ఇచ్చిన డిమాండ్లను నెరవేర్చేవరకు వెనక్కి తగ్గమన్నారు. దళితుల ప్రభుత్వం అని చెప్పుకునే జగన్..ఎస్సీలపైనే ఎస్సీ, ఎస్టీ చట్టం ద్వారా కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. రాజధానిని జగన్ నిర్వీర్యం చేయటానికే ఈ విధంగా చేస్తున్నారని దళిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.