సైబర్ నేరాలకు మహిళలు బలైపోతున్నారు. సామాజిక మాధ్యమాల్లో హాయ్ అంటూ మొదలుపెట్టి... రహస్య సమాచారాన్ని సేకరించి... ఆపై వేధిస్తున్న కేసులు పెరుగుతున్నాయి. ఈ తరహా నేరాలు ఇప్పుడు పోలీసులకు సవాల్‌గా మారుతున్నాయని హోంమంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. వీటికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం సైబర్ మిత్ర ఏర్పాటు చేసిందని తెలిపారు.
విజయవాడలోని ఓ ప్రైవేటు హోటల్లో... మహిళలపై జరుగుతున్న సైబర్ నేరాలు అనే అంశంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. మహిళల రక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని హోంమంత్రి అన్నారు. సాంకేతిక పరిజ్ఞాన వినియోగంతోనే నేరాలు పెరుగుతున్నట్లు అభిప్రాయపడ్డారు.