ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో ఈ నెలాఖరు వరకు కర్ఫ్యూ పొడిగింపు

Curfew extended in ap
రాష్ట్రంలో ఈ నెలాఖరు వరకు కర్ఫ్యూ పొడిగింపు

By

Published : May 17, 2021, 1:09 PM IST

Updated : May 17, 2021, 1:43 PM IST

13:06 May 17

4 వారాలు కర్ఫ్యూ ఉంటేనే సరైన ఫలితాలు: సీఎం జగన్

రాష్ట్రంలో కరోనా ప్రభావంతో విధించిన కర్ఫ్యూను ఈ నెలాఖరు వరకూ పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫలితాలు రావాలంటే.. కనీసం 4 వారాల పాటైనా కర్ఫ్యూ ఉండాలని ముఖ్యమంత్రి జగన్ ఉన్నతాధికారులతో సమీక్షలో వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కర్ఫ్యూ విధించి 10 రోజులే అయ్యిందని సీఎం గుర్తు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో కేసులు పెరగకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు చెప్పిన సీఎం జగన్.. వాలంటీర్లు, ఆశా వర్కర్లు, సచివాలయాల వ్యవస్థను సమర్థంగా వినియోగించుకోవాలన్నారు.

కొవిడ్‌ కారణంగా తల్లిదండ్రులు ఎవరైనా చనిపోతే.. వారి పిల్లలను ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాంటి వారిని ఆదుకునేలా ఆర్థిక సహాయం చేయడంపై తగిన కార్యాచరణ రూపొందించాలన్నారు. వారి పేరు మీద కొంత మొత్తాన్ని డిపాజిట్‌ చేసేలా, దానిపై వచ్చే వడ్డీ ప్రతినెలా వారి ఖర్చులకోసం వచ్చేలా ఆలోచనలు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఇవీ చదవండి: 

'దేశ ప్రజలను కష్టాల్లోకి నెట్టిన మోదీ'

సుప్రీంలో రఘురామ బెయిల్ పిటిషన్‌.. విచారణ శుక్రవారానికి వాయిదా

Last Updated : May 17, 2021, 1:43 PM IST

ABOUT THE AUTHOR

...view details