ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ అంశాలను ముఖ్యమంత్రి స్వయంగా వెల్లడించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. విజయవాడలో మాట్లాడుతూ.. సీఎం తన వ్యక్తిగత విషయాలు చెప్పాల్సిన అవసరం లేదని.. అయితే రాష్ట్రానికి సంబంధించి ప్రధానితో ఏం మాట్లాడారో కచ్చితంగా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు.
అవినీతిని నిరోధిస్తామని నెంబర్ ఇవ్వడం కాదని.. మంత్రి జయరాంపై వచ్చిన ఆరోపణలపై స్పందించి చర్యలు తీసుకోవాలని రామకృష్ణ అన్నారు. మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు అన్నట్లు.. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలను బర్తరఫ్ చేస్తే సీఎం మంత్రివర్గంలో ఒక్క మంత్రి కూడా మిగలరన్నారు. పేద రైతుల వద్ద కొనుగోలు చేసిన భూములను తిరికి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు.