లాక్ డౌన్ కాలంలోని విద్యుత్ బిల్లులను పూర్తిగా రద్దు చేయాలని సీపీఐ నేతలు డిమాండ్ చేశారు. పాత టారిఫ్ ప్రకారమే బిల్లులను వసూలు చేయాలన్నారు. విజయవాడ సీపీఐ నగర కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు.
ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న కార్మికులకు, అర్హులైన ప్రతి కుటుంబానికి కనీసం 10 వేల రూపాయలను ప్రభుత్వం ఆర్ధిక సాయంగా అందజేయాలన్నారు.