మద్యంపై ఆదాయం లేనిదే వైకాపా ప్రభుత్వం బతకలేకపోతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. మద్యం దుకాణాలు మూసివేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. మద్యానికిచ్చే ప్రాధాన్యత.. పేదలకు నిత్యావసర సరకుల పంపిణీపై లేదని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం దుకాణాలు తెరవడమే కాకుండా... కేంద్రం తెరుచుకోమంది అని చెప్పడం సరైనది కాదని ధ్వజమెత్తారు. మందుబాబులకు లాక్ డౌన్ వర్తించదా అని ప్రశ్నంచారు. తక్షణమే మద్యం దుకాణాలు మూసివేయాలని సమావేశంలో సభ్యులు డిమాండ్ చేశారు.
‘మందుబాబులకు లాక్ డౌన్ వర్తించదా?’ - cpi on liqour market during lock down
మద్యం దుకాణాలు మూసివేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. మద్యం తాగేవారికి లాక్ డౌన్ వర్తించదా అని ప్రశ్నించారు.
మద్యపాన నిషేదంపై సమావేశం