ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చాక పౌరహక్కులకు భంగం కలిగిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. భీమవరంలో నిర్వహించిన అల్లూరి జయంతి సభలో ప్రధాని మోదీ గిరిజనులపై అపారమైన ప్రేమ చూపారని.. నిజంగా వారిపై ప్రేమ ఉంటే వారి హక్కులను కాపాడాలన్నారు. సహజ వనరులను దోచేస్తూ.. అడవులను నాశనం చేస్తున్న కార్పొరేట్ కంపెనీల నుంచి అడవులను కాపాడాలని కోరారు.
మోదీ పాలనలో పౌర హక్కులకు భంగం కలుగుతోంది: సీపీఐ నారాయణ
దేశంలో పౌరహక్కులను కాలరాస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. మోదీ అధికారంలోకి వచ్చాక పౌరహక్కులకు భంగం వాటిల్లుతోందని మండిపడ్డారు.
సీపీఐ నారాయణ
గుజరాత్ అల్లర్లపై పిటిషిన్ వేసిన వారిని ఉద్దేశించి సుప్రీం కోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యలు చేయటాన్ని ఖండిస్తున్నామన్నారు. పిటిషనర్లపై అలాంటి వ్యాఖ్యలు చేస్తే.. న్యాయస్థానాలలో పిటిషన్ వేయటానికి ఎవరూ ముందుకు రారన్నారు. పౌర హక్కులను కాపాడాల్సిన బాధ్యత అన్ని వ్యవస్థలపైనా ఉందని చెప్పారు.
ఇవీ చూడండి :
- 'ఈ రాష్ట్రంలోనూ ఏక్నాథ్ శిందే పుట్టుకొస్తారు'.. భాజపా 'నాన్సెన్స్' జోస్యం!
- ముంబయిని ముంచెత్తిన వర్షాలు.. 'మహా'లో మరో 3 రోజులు కుండపోతే..!
- విషమంగా లాలూ ఆరోగ్యం.. సీఎం పరామర్శ.. చికిత్స కోసం సింగపూర్‌కు!