కాణిపాక ఆలయంలో సభాపతి తమ్మినేని చేసిన వ్యాఖ్యలను సీపీఐ నేత నారాయణ తప్పుబట్టారు. తన పరిధిని దాటి స్పీకర్ వ్యవహరించారని మండిపడ్డారు. "దేవుణి సమక్షంలో రాజ్యాంగానికి విరుద్ధంగా తమ్మినేని వ్యవహరించారు. న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా మాట్లడటం సరికాదు. దీనివల్ల రాజకీయ అరాచకత్వం పెరగుతుంది. స్పీకర్గా ఉంటూ రాజకీయాలు మాట్లడటం సరికాదు. అవసరమైతే స్పీకర్ పదవికి రాజీనామా చేసి రాజకీయాలు చేసుకోవచ్చు. నిబంధనలు అతిక్రమిస్తూ న్యాయవ్యవస్థను ప్రశ్నించారు. అలా చేయటం సమంజసం కాదు" అని నారాయణ వ్యాఖ్యనించారు.
'సభాపతి గారు..పదవికి రాజీనామా చేసి రాజకీయాలు చేసుకోండి'
శాసనసభ స్పీకర్ తన పరిధిని దాటి మాట్లాడుతున్నారని సీపీఐ నారాయణ విమర్శించారు. రాజ్యాంగానికి విరుద్ధంగా మాట్లాడరని ఆక్షేపించారు. స్పీకర్ పదవిలో ఉండి రాజకీయాలు మాట్లాడటం సరికాదన్నారు.
'సభాపతి గారు..పదవికి రాజీనామా చేసి రాజకీయాలు చేసుకోండి'