ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'డాక్యుమెంట్స్ చూపించండి.. మీ వాహనం తీసుకువెళ్లండి'

విజయవాడలో లాక్ డౌన్ సమయంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాలను తిరిగి వాహనదారులకు అప్పగిస్తున్నారు. ప్రస్తుతానికి వాహనాలకు ఆన్​లైన్ చలానా విధిస్తామని సీపీ తెలిపారు. వాహనదారులు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న నేపథ్యంలో పీపీఈ కిట్లు ధరించి వారికి వాహనాలను అందజేయాలని సిబ్బందికి సూచించారు.

Vijayawada Car Headquarters
డాక్యుమెంట్స్ చూపించండి.. మీ వాహనం తీసుకువెళ్లండి

By

Published : May 25, 2020, 4:54 PM IST

లాక్ డౌన్ సమయంలో పట్టుబడి విజయవాడ కార్ హెడ్ క్వార్టర్స్ ప్రాంగణం వద్ద ఉన్న వాహనాలను సీపీ ద్వారకా తిరుమలరావు పరిశీలించారు. లాక్ డౌన్ సమయంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాలను తిరిగి వాహనదారులకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. వాహనాలకు సంబంధించిన పూర్తి డాక్యుమెంట్స్ చూపిన తర్వాతే వాహనాలను ఇస్తున్నామన్నారు .లాక్ డౌన్ సమయంలో నిబంధనలు ఉల్లఘించిన 8500 వాహనాలను స్వాధీనం చేసుకున్నామని ఇప్పటికే 5వేల వాహనాలు తిరిగి ఇచ్చేశామని సీపీ తెలిపారు. వాహనదారుల నుంచి పూచికత్తు పత్రాలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఎవరి నుంచి డబ్బులు తీసుకోవట్లేదన్నారు. ఎంవీఐ యాక్ట్ ప్రకారం సీజ్ చేసిన వాహనాలకు ఆన్​లైన్ చలానా విధిస్తామన్నారు. ఐపీసీ ప్రకారం స్వాధీనం చేసుకున్న వాహనాలను కోర్టు తీర్పు అనుసరించి వ్యవహరిస్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details