ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Covid: విద్యార్థులపై కొవిడ్ పంజా.. నిపుణుల అంచనాలు నిజమవుతున్నాయా ?

రాష్ట్రంలో విద్యార్థులపై కొవిడ్ పంజా విసురుతోంది. పాఠశాలలు తెరిచి పది రోజులు గడవకముందే 23 మంది విద్యార్థులు వైరస్ బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. అక్టోబరులో థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని.., చిన్నపిల్లలపై దీని ప్రభావం అధికంగా ఉంటుందని వైద్య నిపుణలు హెచ్చరిస్తున్న తరుణంలో పాఠశాలల్లో కరోనా కేసుల విజృంభణ తల్లిదండ్రులు, విద్యాశాఖ అధికారులను కలవరపెడుతోంది.

విద్యార్థులపై కొవిడ్ పంజా
విద్యార్థులపై కొవిడ్ పంజా

By

Published : Aug 26, 2021, 6:00 AM IST

Updated : Aug 26, 2021, 7:50 AM IST

రాష్ట్రంలో విద్యార్థులపై కొవిడ్ పంజా విసురుతోంది. పాఠశాలలు తెరిచి పది రోజులు గడవకముందే 23 మంది విద్యార్థులు వైరస్ బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. మూడు రోజుల క్రితం కృష్ణా జిల్లా పెద్దపాలపర్రు పాఠశాలలో 13 మంది విద్యార్థులు కరోనా బారిన పడగా.. తాజాగా విజయనగరం జిల్లా బొబ్బిలి ప్రభుత్వ పాఠశాలలోనూ విద్యార్థులకు వైరస్ సోకింది. 26 మంది విద్యార్థులకు కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. వారిలో 10 మందికి వైరస్ నిర్ధరణ అయింది. అక్టోబరులో థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని.., చిన్నపిల్లలపై దీని ప్రభావం అధికంగా ఉంటుందని వైద్య నిపుణలు హెచ్చరిస్తున్న తరుణంలో పాఠశాలల్లో కరోనా కేసుల విజృంభణ తల్లిదండ్రులు, విద్యాశాఖ అధికారులను కలవరపెడుతోంది.

కరోనా హెచ్చరికలు జారీ చేసినా...

కరోనాతో మూతపడిన పాఠశాలలు ఈనెల 16 నుంచి తెరుచుకోవటంతో చదువులు మళ్లీ గాడిన పడ్డాయని తల్లిదండ్రులు సంతోషించారు. కానీ వారి ఆశలు అడియాశలువుతున్నట్లుగా కనిపిస్తోంది. కరోనా కట్టడికి తగిన చర్యలు తీసుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం జగన్ హెచ్చరించారు. అన్ని జాగ్రత్తలు తీసుకొని పాఠశాలలు పునఃప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకు విద్యార్థులకు ఆన్​లైన్​లో పాఠాలు బోధించగా... ప్రభుత్వ తాజా నిర్ణయంతో పాఠశాలలు తెరుచుకొని ప్రత్యక్ష తరగతులు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో దాదాపు 60 వేల పైచిలుకు పాఠశాలుండగా అందులో దాదాపు 70 లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. పాఠశాలలు తెరుచుకొని 10 రోజులు గడవక ముందే విద్యార్థులు కరోనా గుప్పిట్లో చిక్కుకోవటంతో వారి తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

ఇదీ చదవండి: corona: బొబ్బిలిలో 10 మంది విద్యార్థులకు కరోనా

ఆలోచనలో తల్లిదండ్రులు

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పిల్లలను పాఠశాలలకు పంపేందుకు తల్లిదండ్రులు జంకుతున్నారు. పాఠశాలల్లో కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. విద్యార్థులు వైరస్ బారిన పడటం పట్ల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లల చదువులకన్నా.. వారి ఆరోగ్యమే ముఖ్యమనే భావన తల్లిదండ్రుల్లో నెలకొంది. దీంతో పిల్లలను పాఠశాలలకు పంపే విషయంలో తల్లిదండ్రులు ఆలోచనలో పడ్డారు.

సీఎం జగన్ ఏమన్నారంటే..

కొవిడ్‌ పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్‌ ఆదేశించారు. కరోనా రివకరీ రేటు 98.63 శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 2.07శాతంగా ఉందని చెప్పారు. గణాంకాలు, అంకెలతో సంబంధం లేకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొవిడ్ మార్గదర్శకాలు పాటించకపోతే కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు.

కేసులు పెరుగుతున్నాయి...

దేశవ్యాప్తంగా భారీగా కరోనా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. బుధవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం..37 వేల మందికి కొత్తగా కొవిడ్ సోకింది. మరో 648 మంది ప్రాణాలు విడిచారు. కేరళలో ఒక్కరోజే..31 వేల 445 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఒడిశాలో కొత్తగా 887 కరోనా కేసులు వెలుగులోకి రాగా..అందులో 131 మంది 18 ఏళ్ల లోపు వారే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మొత్తం కేసుల్లో చిన్నారుల శాతం 14.76గా నమోదైంది. రాష్ట్రంలోనూ దాదాపుగా ఇదే పరిస్థితి నెలకొంది. గడిచిన 24 గంటల్లో 58 వేల 890 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా..1601 కేసులు నమోదయ్యాయి. వైరస్‌ ప్రభావంతో మరో 16 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చదవండి: పిల్లలపై కరోనా పంజా- కొత్త కేసులు వారిలోనే అధికం !

వివిధ రాష్ట్రాల్లో విద్యాసంస్థల పునఃప్రారంభానికి అక్కడి ప్రభుత్వాలు మెుగ్గుచూపుతున్నాయి. తెలంగాణలో సెప్టెంబరు 1 నుంచి అంగన్వాడీ సహా అన్ని విద్యా సంస్థలు పునఃప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. గుజరాత్​లోనూ...సెప్టెంబర్ 2 నుంచి పాఠశాలలు పునఃప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 50 శాతం సీటింగ్‌ సామర్థ్యంతో 6 నుంచి 8 తరగతుల నిర్వహణకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. అన్ని రాష్ట్రాలు పాఠశాలల పునఃప్రారంభానికి సిద్ధమవుతున్న సమయంలో చిన్నారులపై కొవిడ్ పంజా విసురుతుండటం కలవరపాటుకు గురి చేస్తోంది.

నిపుణుల అంచనాలు నిజమవుతున్నాయా ?

అనేక రాష్ట్రాలు పాఠశాలలను పునఃప్రారంభించి, ప్రత్యక్ష బోధనను మొదలుపెడుతున్నాయి. అక్టోబరు నాటికి కరోనా థర్డ్​ వేవ్ తారస్థాయికి చేరుకునే​ ప్రమాదం ఉందని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్​ఐడీఎం) ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీతో పాటు పలు నివేదికలు హెచ్చరిస్తున్నాయి. ఇలాంటి సమయంలో పాఠశాలలు తెరవటం సరైన నిర్ణయమేనా? అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. చిన్నారులు పెద్ద సంఖ్యలో కరోనా బారిన పడితే..దేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలు ఏ మాత్రం సరిపోవని ఎన్ఐడీఎం కమిటీ పేర్కొంది. భారత్​లో కరోనా ఎండెమిక్​గా మారే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్ఓ ముఖ్య శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ అంచనా వేశారు. కాగా..చిన్నారులకు కరోనా సోకినా పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పిల్లల్లో స్వల్పంగానే కరోనా లక్షణాలు ఉంటాయని..., మరణాల శాతం కూడా పెద్దలతో పోలిస్తే తక్కువగానే ఉందని తెలిపారు. అయితే, ఆస్పత్రుల్లో చికిత్స సదుపాయాలను మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

ఇదీ చదవండి

రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులు..

కేరళలో కరోనా విజృంభణ- అదే కారణమా?

Vaccine Side Effects: భారత్​లో కరోనా టీకా వల్ల సైడ్​ ఎఫెక్ట్స్​ తక్కువే!

Last Updated : Aug 26, 2021, 7:50 AM IST

ABOUT THE AUTHOR

...view details