ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణలో 453 కరోనా కేసులు నమోదు - తెలంగాణ లో కరోనా వార్తలు

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 453కి చేరాయి. బుధవారం 49 కరోనా కేసులు నమోదైనట్టు ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ప్రకటించారు. ఇప్పటికే 45మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా.. మరో 11మంది మృతి చెందారు. మరోవైపు మర్కజ్ వెళ్లి వచ్చిన వారు, వారితో కలిసి ఉన్నవారికి దాదాపు పరీక్షలు పూర్తయినందున కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.

తెలంగాణలో 453 కరోనా కేసులు నమోదు
తెలంగాణలో 453 కరోనా కేసులు నమోదు

By

Published : Apr 9, 2020, 7:03 AM IST

Updated : Apr 9, 2020, 7:53 AM IST

తెలంగాణలో తాజాగా 49 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇక వైద్య ఆరోగ్యశాఖ వద్ద కేవలం 535 శాంపిళ్లు మాత్రమే పరీక్షించాల్సి ఉందన్నందున... అనుమానం ఉన్న అందరికీ పరీక్షలు పూర్తైనట్టేనని స్పష్టం చేసింది. తాజాగా నమోదైన 49 కేసులతో కలిపి తెలంగాణలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 453కి చేరింది. వీరిలో 397 మంది చికిత్స తీసుకుంటుండగా... 45మంది కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. మరో 11మంది మృతి చెందారు. ఐసీయూలో ఎవరూ లేరని... విదేశాల నుంచి వచ్చిన వారిలో నెగెటివ్​ తేలిన వారిని ఇవాళ డిశ్చార్జ్​ చేయనున్నట్టు ఈటల తెలిపారు.

గచ్చిబౌలిలో భారీ ఆసుపత్రి

తెలంగాణ నుంచి మర్కజ్​కు 1100 మంది వెళ్లగా.. వారితో కాంటాక్ట్​లో ఉన్న 3 వేల 188 మందికి కరోనా పరీక్షలు పూర్తైనట్టు ఈటల రాజేందర్ పేర్కొన్నారు. కరోనా లేనివారిని హోం క్వారంటైన్​కి తరలిస్తున్నామన్న ఈటల... రాష్ట్రవ్యాప్తంగా 167 క్వారంటైన్ కేంద్రాలు ఖాళీ కానున్నట్టు వెల్లడించారు. గచ్చిబౌలిలో 1500 పడకలతో భారీ స్థాయి ఆస్పత్రిని కేవలం 15రోజుల్లో సిద్ధం చేసిన ఘనత వైద్య ఆరోగ్య శాఖకే దక్కిందన్నారు. ప్రైవేటు మెడికల్ కళాశాలలకు చెందిన ఆసుపత్రులను కూడా పూర్తిస్థాయిలో కరోనా ఆసుపత్రులుగా మారుస్తున్నామన్నారు.

బీమాకు ఏర్పాట్లు పూర్తి

వైద్యులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న ఈటల.... కేంద్ర ప్రభుత్వం వైద్యులకోసం ఏర్పాటు చేసిన ఇన్సూరెన్స్ పథకానికి సంబంధించిన అన్ని పనులను పూర్తి చేసినట్టు ప్రకటించారు. తెలంగాణలో ఎలాంటి ఇబ్బంది లేకుండా 400కోట్లతో మందులను కొనుగోలు చేసినట్టు ఆయన ప్రకటించారు. 80వేల పీపీఈ కిట్లు అందుబాటులో ఉన్నాయని మరో 5లక్షల కిట్లకు ఆర్డర్ ఇచ్చినట్టు స్పష్టం చేశారు. 3.5లక్షల టెస్టింగ్ కిట్లను అందుబాటులోకి తేనున్నట్టు ప్రకటించారు.

మర్కజ్ వెళ్లివచ్చిన వారిలో కరోనా నిర్ధారణ పరీక్షలు దాదాపు పూర్తైనందున... తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గే అవకాశం ఉందని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు కమ్యునిటీ ట్రాన్స్​మిషన్​ లేకపోవటం గమనార్హమన్నారు.

ఇదీ చదవండి:34 కొత్త కేసులు.. ముగ్గురు పిల్లలకు కరోనా పాజిటివ్

Last Updated : Apr 9, 2020, 7:53 AM IST

ABOUT THE AUTHOR

...view details