సోనియాగాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ విచారణను నిరసిస్తూ.. విజయవాడలో కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది. భాజపా చేయకూడని తప్పు చేస్తోందని పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ మండిపడ్డారు. సోనియాను ఈడీ విచారణకు తీసుకురావడం కుట్రపూరిత చర్యగా పేర్కొన్నారు. నేషనల్ హెరాల్డ్ మూసేసిన కేసని తెలిపారు. భాజపా దేశాన్ని భ్రష్ఠు పట్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ సంస్థలను వాడుకొని సోనియా, రాహుల్‌ను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. తక్షణమే ఈడీ విచారణ నిలిపేసి సోనియా, రాహుల్‌కు క్షమాపణలు చెప్పాలన్నారు.
సోనియా, రాహుల్‌పై ఈడీ విచారణ కుట్రపూరితం: ఏపీసీసీ - సోనియా ఈడీ విచారణ న్యూస్
సోనియాగాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ విచారణకు నిరసనగా రాష్ట్రంలో కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. వారిపై ఈడీ విచారణ కుట్రపూరితమని పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేషనల్ హెరాల్డ్ మూసేసిన కేసని వెల్లడించారు.
ఏపీసీసీ
కాంగ్రెస్, నెహ్రూ కుటుంబీకులపై కేంద్ర ప్రభుత్వం వేధింపులకు దిగడం దారుణమని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి మండిపడ్డారు. స్వాతంత్య్రోద్యమంలో కీలక పాత్ర పోషించిన నేషనల్ హెరాల్డ్ పత్రికకు పూర్వ వైభవం తెచ్చేందుకు రాహుల్, సోనియా కృషి చేస్తే తప్పుడు కేసులు బనాయిస్తారా ? అని నిలదీశారు. 2024లో భాజపా కాలగర్భంలో కలిసిపోవటం ఖాయమని జోస్యం చెప్పారు. ఈ కేసు నుంచి సోనియా గాంధీ, రాహుల్ అగ్ని పునీతులుగా బయటకొస్తారన్నారు.
ఇవీ చూడండి