ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మాట తప్పడం, మడమ తిప్పడం జగన్ పేటెంట్ : తులసిరెడ్డి - అమరావతి రైతుల ఉద్యమం తాజా వార్తలు

మాట మీద నిలబడడం కాంగ్రెస్ పేటెంట్, మాట తప్పడం, మడమ తిప్పడం జగన్ పేటెంట్ అని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి విమర్శించారు. రాజధాని మార్పుపై అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలన్నారు. మాట తప్పడం.. మడమ తిప్పడం ముఖ్యమంత్రికి, వైకాపా నాయకులకు దినచర్య అయ్యిందన్నారు.

congress leader tulasireddy comments on jagan over capital issue
congress leader tulasireddy comments on jagan over capital issue

By

Published : Aug 3, 2020, 10:45 PM IST

ముఖ్యమంత్రి జగన్ ఈ 14 నెలల కాలంలో పలుసార్లు మాట తప్పడం మడమ తిప్పడం చేశారని తులసిరెడ్డి విమర్శించారు. రైతు భరోసా పథకం కింద ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి రూ.12,500 ఇస్తామని చెప్పి అందులో రూ.5,000 కోత పెట్టారని విమర్శించారు. ప్రత్యేక హోదా సాధన ద్వారా ఉద్యోగాల విప్లవం తీసుకొస్తామని చెప్పి ప్రస్తుతం హోదా మాట మరిచారన్నారు. వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు సీబీఐ విచారణ కోరి సీఎం అయ్యాక సీబీఐ విచారణ వద్దని మాట మార్చారని గుర్తు చేశారు. అసెంబ్లీ సాక్షిగా అమరావతిని రాజధానిగా స్వాగతిస్తున్నామని చెప్పి... రాజధాని మారుస్తున్నారని తులసిరెడ్డి పేర్కొన్నారు. రాజధాని మార్పు అనే ఏకైక అజెండా మీద ఎన్నికలకు పోవాలని తులసి రెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details