వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా నాడు సోనియాగాంధీ చేతుల మీదుగా పోతిరెడ్డిపాడు నుంచి కాలువలకు నీళ్లు వదిలారని తులసిరెడ్డి గుర్తు చేశారు. అప్పటికి వైకాపా ఆవిర్భవించలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ రాయలసీమ ప్రాజెక్టులపై చిత్తశుద్ధితో పని చేసిందన్నారు. ఆరోగ్యశ్రీ పథకం రాజీవ్ ఆరోగ్యశ్రీ అని కాంగ్రెస్ పార్టీ మానసపుత్రిక అన్నారు. నేడు వెయ్యి రూపాయలు మించితే వైద్య ఆరోగ్యశ్రీ నెట్వర్క్ పరిధిలోని ఆసుపత్రుల్లో వైద్యం అందించాలన్న ఆలోచన మంచిది కాదన్నారు. ఆ నిర్ణయం వలన ప్రభుత్వాసుపత్రులు మూతపడే ప్రమాదం ఉందని.. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ పరిధిలో లేని ఆసుపత్రులు కూడా రోగులు లేక మూతపడతాయన్నారు. కేవలం నెట్వర్క్ పరిధిలోని ఆసుపత్రులకు ప్రజాధనం దోచిపెట్టడానికే ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు.
'రాయలసీమకు నీళ్లిచ్చింది..కాంగ్రెస్ అని ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు' - రాయలసీమకు నీళ్లపై తులసిరెడ్డి కామెంట్స్
రాయలసీమ నీళ్లిచ్చిన ఘనత వైఎస్సార్‌దేనని పదేపదే చెప్తున్నా వైకాపా నాయకులు పరోక్షంగా ఆ ఘనత కాంగ్రెస్ పార్టీదేనని ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు అని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి అన్నారు.
'రాయలసీమకు నిళ్లిచ్చింది.. కాంగ్రెస్ అని ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు'