ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చిననాటి నుంచి మహిళా అధికారులపై వైకాపా గూండాలు వేధింపులకు పాల్పడుతున్నారని ఏపీసీసీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ ఆరోపించారు. ఇంత జరుగుతున్నా... మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ స్పందించకపోవటం దారుణమన్నారు. గత ప్రభుత్వంలో పని చేసిన మహిళా కమిషన్ ఛైర్పర్సన్ మహిళలకు అన్యాయం జరిగితే రాజకీయాలకు అతీతంగా బాధితులను పరామర్శించేవారని గుర్తుచేశారు.
'మహిళలపై దాడులు జరుగుతున్నా స్పందించరా?'
ఏడాదిగా రాష్ట్రంలో మహిళలపై దాడులు జరుగుతున్నా.. మహిళా కమిషన్ ఛైర్పర్సన్ పట్టించుకోకపోవటం దారుణమని ఏపీసీసీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ ఆరోపించారు. గత ప్రభుత్వంలో పని చేసిన మహిళా కమిషన్ ఛైర్పర్సన్ మహిళలకు అన్యాయం జరిగితే రాజకీయాలకు అతీతంగా బాధితులను పరామర్శించేవారని గుర్తుచేశారు.
'మహిళలపై దాడులు జరుగుతున్నా స్పందించరా?'
రాజధాని కోసం భూములు త్యాగం చేసి , అమరావతి పరిరక్షణ కోసం శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న మహిళలపైన దాడులు, తప్పుడు కేసులు, అసభ్యకరమైన పోస్టులు పెట్టినా స్పందించటం లేదని వాపోయారు. అన్యాయాలను ప్రశ్నించిన ప్రతిపక్షాలపై తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.