తెలంగాణలోని ఖమ్మం జిల్లా చింతకానిలో ఎస్పీ మహిళ మరియమ్మ (Mariyamma) లాకప్‌డెత్‌కు కారణమైన పోలీసులపై తక్షణమే విచారణ జరిపి, నిజనిర్ధరణ చేయాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ (Cm Kcr)...డీజీపీ మహేందర్ రెడ్డి (Dgp Mahender Reddy)ని ఆదేశించారు. బాధ్యులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే వారిని ఉద్యోగం నుంచి తొలగించాలని సీఎం స్పష్టం చేశారు.
అత్యంత బాధాకరం...
మరియమ్మ లాకప్‌డెత్ అత్యంత బాధాకరమని...ఇలాంటి చర్యలను ప్రభుత్వం సహించబోదని ముఖ్యమంత్రి అన్నారు. మరియమ్మ కుమారుడు, కుమార్తెలను ప్రభుత్వం ఆదుకుంటుందని సీఎం హామీ ఇచ్చారు. కుమారుడు ఉదయ్‌కిరణ్‌కు ప్రభుత్వ ఉద్యోగం, నివాస గృహంతో పాటు, రూ. 15 లక్షల పరిహారం, మరియమ్మ ఇద్దరు కుమార్తెలకు చెరో రూ. 10 లక్షలు ఆర్థిక సాయంగా అందించాలని సీఎస్ సోమేశ్ కుమార్ (CS Somesh Kumar)ను ఆదేశించారు.
భట్టితో కలిసి వెళ్లండి...
ఖమ్మం జిల్లా చింతకానికి వెళ్లి లాకప్‌డెత్ సంఘటనా పూర్వాపరాలను తెలుసుకుని బాధితులను పరామర్శించి రావాలని డీజీపీని కేసీఆర్ ఆదేశించారు. మరియమ్మ లాకప్‌డెత్ ఘటనలో పోలీసుల తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్...ఈనెల 28న స్థానిక ఎమ్మెల్యే, కాంగ్రెస్ శాసన సభా పక్షనేత (భట్టి విక్రమార్క Bhatti Vikramarka)తో కలిసి స్థానిక మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్, ఎస్సీ బాధిత కుటుంబాలను కలిసి పరామర్శించి రావాలని సూచించారు.