ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'వైయస్​ఆర్ జలకళ' పథకం ప్రారంభానికి సర్వం సిద్ధం - ఏపీలో వైయస్​ఆర్ జలకళ పథకం ప్రారంభం

రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో పథకానికి సోమవారం శ్రీకారం చుట్టబోతోంది. వైయస్​ఆర్ జలకళ పేరుతో పొలాల్లో బోర్లు వేసే పథకం ప్రవేశపెట్టనుంది. దీని కోసం రూ. 2,340 కోట్లు కేటాయించారు. దీని ద్వారా రాష్ట్రంలో 5 లక్షల ఎకరాల్లో ఉచితంగా బోర్లు వేసి.. పొలాలకు సాగునీరు అందించనున్నారు. ముఖ్యమంత్రి జగన్ ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు.

cm jagan will inaugurates ysr jalakala scheme at monday
వైయస్​ఆర్ జలకళ పథకం

By

Published : Sep 27, 2020, 11:30 PM IST

రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో పథకానికి సోమవారం శ్రీకారం చుట్టబోతోంది. రైతులకు ఉచితంగా బోర్లు తవ్వించేందుకు 'వైఎస్ఆర్ జలకళ' పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. తద్వారా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేర్చనున్నారు. ఈ సందర్భంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులు, రైతులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సీఎం మాట్లాడతారు.

ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల మంది రైతులకు మేలు జరుగుతుందని ప్రభుత్వం తెలిపింది. వైయస్‌ఆర్‌ జలకళ కోసం రూ. 2 వేల 340 కోట్లు కేటాయించారు. 5 లక్షల ఎకరాలకు ఉచితంగా బోర్లు వేయడం ద్వారా పొలాలకు సాగునీరు అందించనున్నారు. రైతులు ఈ పథకం కోసం తమ పరిధిలోని గ్రామ వాలంటీర్ల ద్వారా గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. అలాగే... ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తు చేసుకునే వీలు కల్పించినట్లు వెల్లడించారు.

బోర్లు వేసే విధానం

రైతులు చేసుకున్న దరఖాస్తులు గ్రామ సచివాలయం స్థాయిలో వీఆర్వో పరిశీలించి, అక్కడి నుంచి డ్వామా అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌ సదరు దరఖాస్తులను భూగర్భ జలాల సర్వే కోసం ముందుగా జియాలజిస్ట్​కు పంపుతారు. సాంకేతికంగా దానిని జియోలజీ విభాగం పరిశీలించి అనుమతి ఇవ్వగానే డ్వామా అసిస్టెంట్ పీడీ సదరు దరఖాస్తుకు పరిపాలనా అనుమతి ఇస్తారు. అనంతరం కాంట్రాక్టర్ డ్రిల్లింగ్ సైట్​లో బోరుబావులను తవ్వుతారు. బోరు బావుల సక్సెస్‌ శాతాన్ని బట్టి కాంట్రాక్టర్‌కు బిల్లుల చెల్లింపులు చేస్తారు.

ప్రత్యేక సాఫ్ట్​వేర్ ద్వారా పర్యవేక్షణ

వైయస్‌ఆర్ జలకళ పథకం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌ను ప్రభుత్వం సిద్దం చేసింది. ఆ సాఫ్ట్‌వేర్‌ ద్వారా రైతులు దరఖాస్తు చేసుకున్న తరువాత నుంచి దానికి అనుమతులు ఇవ్వడం, బోర్‌ బావి తవ్వకం, కాంట్రాక్టర్‌కు బిల్లు చెల్లించడం వరకు అత్యంత పారదర్శకతతో, నిర్ణీత సమయంలోనే ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు తెలిపింది. ప్రతి దశలోనూ రైతుకు తన దరఖాస్తుకు సంబంధించిన వివరాలు ఎస్‌ఎస్‌ఎంల ద్వారా పంపిస్తారు. అలాగే ఆన్‌లైన్‌ ద్వారా కూడా తన దరఖాస్తు ఏ దశలో ఉందో రైతు తెలుసుకునే వెసులుబాటు కల్పించారు. ఏ రోజు రైతు పొలంలో బోర్ డ్రిల్లింగ్ చేస్తారో అది రైతు ఫోన్‌కు ఎస్‌ఎంఎస్‌ ద్వారా, వాలంటీర్ల ద్వారా సమాచారం అందిస్తారు. ఒకవేళ మొదటిసారి బోర్ డ్రిల్లింగ్​లో నీరు పడక విఫలం అయితే, మరోసారి బోర్‌ కోసం నిపుణుడైన జియోలజిస్ట్‌ నిర్దేశించిన ప్రాంతంలో డ్రిల్లింగ్ చేసేందుకు అవకాశం కల్పించినట్లు ప్రభుత్వం తెలిపింది.

ఇవీ చదవండి:

'మనకు ఎన్నో ఇచ్చిన అడవికి ఎంతో కొంత తిరిగివ్వాలి.. లేకపోతే!'

ABOUT THE AUTHOR

...view details