ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CM Jagan Delhi Tour: నేడు దిల్లీకి సీఎం జగన్‌.. ప్రధానితో భేటీ - cm jagan dehli tour news

cm jagan to visit delhi and meet pm narendra modi
దిల్లీకి సీఎం జగన్‌.. ప్రధానితో భేటీ

By

Published : Apr 4, 2022, 11:06 AM IST

Updated : Apr 5, 2022, 3:11 AM IST

11:03 April 04

రాష్ట్ర సమస్యల పరిష్కారంపై ప్రధానితో చర్చించనున్న ముఖ్యమంత్రి

CM Jagan Delhi Tour:ముఖ్యమంత్రి జగన్‌.. రెండురోజుల పర్యటనలో భాగంగా నేడు దిల్లీకి వెళ్లనున్నారు. సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను కలవనున్నారు. వారి అపాయింట్‌మెంట్లు దాదాపు ఖరారు అయినట్లు ముఖ్యమంత్రి కార్యాలయవర్గాల సమాచారం. రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటు అవసరం గురించి, 26 జిల్లాల ఏర్పాటు విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకువెళ్లే అవకాశం ఉందని తెలిసింది.

పోలవరం, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్ల వంటి అంశాలతోపాటు విభజన చట్టంలోని అపరిష్కృత హామీల అమలుపైనా సీఎం ప్రధానితో చర్చిస్తారని సమాచారం. ప్రజాకర్షక పథకాలతో కొన్ని రాష్ట్రాలు ఆర్థిక క్రమశిక్షణను పాటించడం లేదని.. కేంద్రంలోని వివిధ విభాగాల కార్యదర్శులు ఈ నెల 2న ప్రధాని నరేంద్రమోదీ నిర్వహించిన సమావేశంలో వెల్లడించిన విషయం కూడా చర్చకు రావచ్చన్న వాదన ఉంది. ఈ నేపథ్యంలో ఏపీ పరిస్థితి ఏంటనే అంశం ప్రస్తావనకు రావచ్చని అంటున్నారు. రాత్రికి ముఖ్యమంత్రి దిల్లీలోనే బస చేయనున్నారు. బుధవారం ఉదయం అందుబాటులో ఉండే కేంద్ర మంత్రులను కలిసి తిరిగి రాష్ట్రానికి రానున్నారు.

ఇదీ చదవండి:

New Districts: రాష్ట్రంలో 13 నుంచి 26కు పెరిగిన జిల్లాలు.. ప్రారంభించిన సీఎం

Last Updated : Apr 5, 2022, 3:11 AM IST

ABOUT THE AUTHOR

...view details