ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Rs. 5 LAKHS EX GRATIA: బస్సు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి.. రూ. 5 లక్షల పరిహారం - జల్లేరు బస్సు ప్రమాద మృతులకు 5 లక్షలు పరిహారం

CM JAGAN ANNOUNCED Rs. 5 LAKHS EX GRATIA
CM JAGAN ANNOUNCED Rs. 5 LAKHS EX GRATIA

By

Published : Dec 15, 2021, 2:33 PM IST

Updated : Dec 15, 2021, 4:48 PM IST

14:25 December 15

CM JAGAN ANNOUNCED Rs. 5 LAKHS EX GRATIA TO PEOPLE DIED IN BUS ACCIDENT

Rs. 5 LAKHS EX GRATIA: పశ్చిమగోదావరి జిల్లా జల్లేరు వద్ద జరిగిన బస్సు ప్రమాద ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి జగన్మోహన్​ రెడ్డి రూ. 5 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. పరిహారాన్ని బాధిత కుటుంబాలకు అందించాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని కలెక్టర్​కు సూచించారు.

అసలు ఏం జరిగిందంటే..

పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భద్రాచలంలో ఉదయం 8.30కు బయలుదేరిన జంగారెడ్డిగూడెం బస్సు.. జంగారెడ్డిగూడెం మండలం పరిధిలో జల్లేరు వద్ద ఆర్టీసీ బస్సు వాగులో పడింది. ఈ ఘటనలో తొమ్మిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. ఆర్టీసీ బస్సులోని మిగిలిన ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారు. వంతెన రెయిలింగ్​ను ఢీకొన్న బస్సు.. ఒక్కసారిగా 25 అడుగులు లోతుగా ఉన్న వాగులో పడింది. వేలేరుపాడు నుంచి జంగారెడ్డిగూడెం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఘటన సమయంలో బస్సులో 40 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదస్థలిలోనే బస్సు డ్రైవర్‌ మృతి చెందాడు. మృతుల్లో ఐదుగురు మహిళలు ఉన్నట్లు గుర్తించారు. మరణించినవారిలో ఎక్కువగా మహిళలు, చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. నీటిలో పడిన బస్సు నుంచి బయటికి రాలేకే 9 మంది మృతి చెందినట్లు స్థానికులు చెబుతున్నారు.

ప్రమాదం జరిగిన వెంటనే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నప్రజలు సహాయక చర్యలకు ముందుకొచ్చారు. మృతిచెందిన వారిని బస్సు కిటికీల నుంచే బయటకు తీశారు. కిటికీల నుంచి కొందరు ప్రయాణికులు బయటకు వచ్చారు. మిగిలిన ప్రయాణికులను స్థానికులు కాపాడారు. ఘటనాస్థలిలో.. ఆర్​డీఓ, డీఎస్పీ ఆధ్వర్యంలో సహాయచర్యలు చేపట్టి బస్సును వాగులో నుంచి బయటకు తీశారు. క్షతగాత్రులను ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. బస్సులోపలే ఉండిపోయినవారిని.. స్థానికులు పడవల సాయంతో ఒడ్డుకు చేర్చారు. జంగారెడ్డిగూడెం డిపోకు చెందిన బస్సు.. అతివేగంతో రావడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు అంటున్నారు.

విచారణకు ఆదేశం..

బస్సు ప్రమాదంపై మంత్రి పేర్ని నాని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ప్రమాదంపై మంత్రి విచారణకు ఆదేశించారు. విచారణ జరిపి నివేదిక అందించాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఇదీ చదవండి:

Bus accident: ఘోర ప్రమాదం..వాగులో పడ్డ ఆర్టీసీ బస్సు.. 9 మంది మృతి

Last Updated : Dec 15, 2021, 4:48 PM IST

ABOUT THE AUTHOR

...view details