ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CM Jagan: ఉద్యాన రైతుల ఆదాయం పెంచేందుకు చర్యలు చేపట్టండి: సీఎం జగన్​

రైతులకు బిందు, తుంపర సేద్య పరికరాల అందజేతకు రివర్స్ టెండరింగ్‌కు వెళ్లాలని సీఎం జగన్‌ ఆదేశించారు. మెరుగైన సాగు విధానాలు, నాణ్యమైన ఉత్పత్తులకు అవసరమైన పరిశోధనలు చేయాలని.. సంబంధిత సంస్థల సహకారం తీసుకోవాలన్నారు. ఉద్యాన రైతులు నష్టపోకుండా ఉండేలా అన్ని విధాలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అధిక ఆదాయాన్నిచ్చే పంటల వైపు రైతులను ప్రోత్సహించాలని నిర్దేశించారు

CM Jagan
CM Jagan

By

Published : Aug 13, 2021, 7:20 PM IST

Updated : Aug 14, 2021, 6:00 PM IST

ఉద్యాన రైతుల ఆదాయం పెంచేందుకు చర్యలు చేపట్టండి: సీఎం జగన్​

ఉద్యాన, పట్టు పరిశ్రమ, వ్యవసాయం అనుబంధ రంగాలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఉద్యాన రైతుల ఆదాయం పెంచేలా చూడాలని సీఎం ఆదేశించారు. ఉద్యాన రంగంలో రైతులు ఆదాయాన్ని పెంచే వ్యూహాలను అమలు చేయాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. ఉద్యానపంటల్లో గరిష్ఠ సాగుతో ప్రూట్‌ బౌల్‌ ఆఫ్‌ ఇండియాగా ఏపీ పేరు పొందిందని సీఎంకు అధికారులు తెలిపారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, విజ్ఞానాన్ని రైతులకు అందించడం కోసం జాతీయంగా, అంతర్జాతీయంగా నైపుణ్య సంస్ధలు, యూనివర్సిటీల సహకారం తీసుకోవాలన్నారు. నిరంతర పరిశోధనలు, పరస్పర సమాచార మార్పిడి ద్వారా అధ్యయనం, ప్రయోగాలు కొనసాగాలన్న సీఎం దిశానిర్ధేశం చేశారు.

సాంకేతికతను అందిపుచ్చుకోండి..

ఎప్పటికప్పుడు వస్తున్న కొత్త వంగడాలు, సాగులో సమస్యల పరిష్కారం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో కొత్త టెక్నాలజీ, ప్రాసెసింగ్‌కు అనుకూలమైన రకాలు సాగు చేయడమే లక్ష్యంగా ఈ పరిశోధనలు ఉండాలన్నారు. కర్నూలు జిల్లాలో మంచి మార్కెట్‌ అవకాశాలున్న ఉల్లి సాగుపై దృష్టి పెట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. నాణ్యమైన ఉల్లి సాగయ్యేలా చూడాలని, ఫుడ్‌ ప్రాసెసింగ్‌కు అనుకూలంగా ఉన్న భిన్న రకాలు సాగు అయ్యేలా చూడాలన్నారు. టమోటాను రోడ్డుమీద పారబోయడం, ధరలేక పొలంలోనే రైతులు ఉల్లిపంటను వదిలేసే పరిస్ధితి కనిపించకూడదని చెప్పారు. దీనికోసం సరైన పరిష్కారాలను అన్వేషించాలని అన్నారు.

ప్రాసెసింగ్​ యూనిట్ల ఏర్పాటు..

కొబ్బరి, అరటి, బొప్పాయి, మిరప, టమోట, ఉల్లి, బత్తాయి పంటల సాగుపై సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం ఆదేశించారు. కొబ్బరి, బొప్పాయి, టమోట సాగులోనూ, ఉత్పాదకతలోనూ దేశంలోనే ఏపీ ప్రథమ స్ధానంలోనే నిల్చిందని, టిష్యూ కల్చర్‌ విధానంలో అరటిసాగు చేపడుతున్నామని అధికారులు తెలిపారు. పుడ్‌ ప్రాససింగ్‌లో భాగంగా 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో వివిధ వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్‌ యూనిట్ల నిర్మాణ పనులు మొదలు కావాలని ఆదేశించారు. అక్టోబరు నుంచి దశలవారీగా నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.

పరిశోధనలు పెంచండి.. రైతులకు సహకరించండి

మిరపసాగు విస్తీర్ణం పెంచడంతో పాటు ప్రాసెసింగ్‌పైనా మరింత దృష్టి పెట్టాలని, దీనికోసం అంతర్జాతీయ సంస్థల సహకారం తీసుకోవాలని సీఎం ఆదేశించారు. కొబ్బరిసాగులో ఎదురవుతున్న సమస్యలు సహా.. పంటకు మంచి ధర వచ్చేలా చూడాలని, దీనికోసం నిరంతరం పరిశోధనలు చేయాలని హార్టికల్చర్‌ విశ్వవిద్యాలయం వీసీని సీఎం ఆదేశించారు. అవసరమైతే అత్యుత్తమ సంస్థల సహకారం కూడా తీసుకోవాలన్నారు. జాతీయ, అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో సహకారం, సమాచార మార్పిడి నిరంతరం కొనసాగాలని, దీని వల్ల సాగులో వస్తున్న సమస్యలకు మంచి పరిష్కారాలు లభిస్తాయన్నారు. వీటితో పాటు ప్రాససింగ్‌ రంగంలో వస్తున్న సాంకేతిక పరిజ్ఞానంపైనా ఎప్పటికప్పుడు అధ్యయనాలు జరగాలన్నారు. రైతుల సందేహాలను అగ్రికల్చర్ అసిస్టెంట్లు సత్వరమే తీర్చేలా వ్యవస్థ ఏర్పాటు చేయాలన్నారు.

అగ్రికల్చర్‌ విద్యార్థులు తప్పనిసరిగా ఆర్బీకేల్లో కనీసం నెల రోజులపాటు పనిచేసేలా నిబంధన పెట్టాలని సీఎం ఆదేశించారు. బోర్లు కింద వరిసాగు, సుబాబుల్, పొగాకు, చెరకు, మొక్కజొన్న వంటి పంటల సాగుని క్రమంగా తగ్గించి, ఉద్యాన పంటలసాగు వైపు మొగ్గుచూపేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ ఏడాది 1,51,742 ఎకరాల్లో ఉద్యాన పంటల అదనపు సాగు లక్ష్యం నిర్దేశించుకున్నట్లు అధికారులు తెలిపారు. మార్కెటింగ్‌ చేయగలిగే అవకాశం ఉన్న ప్రతి వంగడాన్ని కూడా రైతుల్లోకి విరివిగా తీసుకెళ్లాలన్నారు. రైతులు కష్టపడి సాగుచేసిన తర్వాత వాటిని మార్కెటింగ్‌ చేయడం కోసం మళ్లీ కష్టపడే పరిస్థితి రాకూడదన్నారు. పువ్వులు సాగు చేసే రైతుల విషయంలో సరైన మార్కెటింగ్‌ అవకాశాలు, వాటి ప్రాసెసింగ్‌పైనా దృష్టి పెట్టాలన్నారు.

నాణ్యమైన పరికరాలు అందుబాటులోకి..

ఏపీఎంఐపీ పైనా సీఎం సమీక్షించారు. తుంపరసేద్యం, బిందుసేద్యం పరికరాల మంజూరులో పారదర్శకతకు పెద్దపీట వేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఆర్బీకేల ద్వారా లబ్ధిదారులు ఎంపిక చేయాలని, నాణ్యమైన పరికరాలు మంచి రేట్లకు ప్రభుత్వానికి, రైతులకు అందుబాటులోకి వచ్చేందుకు రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లాలన్నారు. అవినీతికి తావులేని విధానంలో రైతులకు పరికరాలు అందుబాటులోకి తీసుకురావాలని సీఎం నిర్దేశించారు. అగ్రికల్చర్‌ విద్యార్థులు ఇకపై తప్పనిసరిగా ఆర్బీకేల్లో కనీసం నెలరోజులపాటు పనిచేసేలా నిబంధన పెట్టాలని సీఎం ఆదేశించారు.

ఇదీ చదవండి:

CS Meeting with IAS officers: 'ఐఏఎస్ అధికారులూ.. సచివాలయానికి రండి!'

Last Updated : Aug 14, 2021, 6:00 PM IST

ABOUT THE AUTHOR

...view details